నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో నగరవాసులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఓవైపు మాయదారి విషజ్వరాలు వచ్చి ఎక్కడ  ప్రాణాలను హరించుకుపోతాయో  అనే భయం కలిగిస్తుంటే... మరోవైపు భారీ వర్షాలతో  డ్రైనేజీ నాలాలూ  నిండి పొంగి పొర్లడంతో  రహదారులే  కాక  ఇళ్ళ ముందు పరిసరాలన్నీ జలమయం కావడంతో ఈగలు దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో నగర ప్రజలందరూ బెంబేలెత్తుతున్నారు. దోమలు  మామూలుగా కుడితేనే డెంగ్యూ మలేరియా లాంటి మాయదారి జ్వరాల బారిన పడి తల్లడిల్లుతుంటే... భారీ వర్షంతో డ్రైనేజి   నాలాలూ  పొంగి  పరిసరాల్లో చేరిన మురుగు నీరు తో దోమలు ఈగలు తమపై  దండయాత్ర చేస్తే ఇక తమ ప్రాణాలు  గాల్లో కలిసి పోవడం తప్ప వేరే దారి లేదు అంటున్నారు నగరవాసులు. 

 

 

 

 

 

 భారీ వర్షాలతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జలమయం అవడం... ఎక్కడికక్కడ నాలాల్లో ఇరుక్కుపోయిన చెత్త మొత్తం ఇంటి ముందుకు చేరడంతో... దోమలు ఈగలు స్వైరవిహారం చేస్తున్నాయి అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దోమలు స్వైరవిహారం చేయడంతో విష జ్వరాల బారిన పడి... ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి జోబులు గుల్ల  చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకీ తీవ్రమవుతున్న విషజ్వరాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

 

 

 

 

 

 ఇక రోజు రోజుకి డెంగ్యూ మలేరియా లాంటి మాయదారి విష జ్వరాలు బారిన పడుతున్న ప్రజల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ప్రైవేటు ఆసుపత్రులు  పండగ చేసుకుంటున్నాయి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు మొత్తం చుట్టుపక్కల పరిసరాలలో చేరడంతో... ఇక చూస్కో నా సామిరంగా... ప్రైవేట్ ఆస్పత్రులన్ని  విష జ్వరాల బారిన పడిన రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ భారీ వర్షాలతో ప్రైవేట్ ఆస్పత్రులకు మంచి గిరాకీ దొరికిందని చెప్పొచ్చు. కాగా మాయదారి విష జ్వరాల తీవ్రమై ప్రజల ప్రాణాలను హరించుకుపోతున్నాయి. దీంతో రోజురోజుకు ఎక్కువవుతోన్న  విషజ్వరాల భయంతో బిక్కు బిక్కు మంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు నగరవాసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: