హైదరాబాద్‌లో వర్షం బీభత్సం కొనసాగుతోంది. ఓ వైపు ఆర్టీసీ సమ్మెతో సతమతమవుతున్న జీవుడు నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్నాడు. ఈ జల్లులతో పాటే అంటు రోగాలు కూడా ఈగల్లా ముసురుకుంటాయి. ముఖ్యంగా ఈ కాలంలో ఈగల మోత ఎక్కువగా కనిపిస్తుంటుంది. వీటికితోడు అప్పటివరకూ వేడిగా ఉన్న వాతావరణం కాస్తా ఒక్కసారి చల్లబడగానే అంటురోగాలు ప్రబలే అవకాశాలు ఎక్కువవుతాయి. ఈ దశలో చాప కింద నీరులా అంటురోగాలు, ఈగలతో, దోమలతో మనుషుల పై దండయాత్ర చేస్తున్నాయి.


కొన్ని కొన్ని చోట్ల వీటి నివారణకు ఎలాంటి చర్యలు జీఎచ్ఎంసీ తీసుకోకపోవడంతో అక్కడ నివసించే ప్రజలు అంటురోగాల బారిన పడి ప్రాణాపాయ స్దితిలోకి కూడా వెళ్లుతున్నారు. ఇక పోతే అనేక ప్రాంతాల్లో ఇప్పటికే చెత్తా, చెదారం గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి పారిశుధ్యం లోపించడం వలన అంటురోగాలు ఎక్కువగా ప్రబలుతున్నాయి. వీటిలో ఫ్లూ జ్వరం, మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ లాంటి రోగాలు వ్యాపిస్తాయని జనాలు ఆందోళన చెందుతున్నారు. ఇకపోతే ఇంట్లో ఏ ఒక్కరికైనా అంటు రోగం వచ్చినా అది శరవేగంగా అందరికీ వ్యాపిస్తుంది. ఇక ఏకదాటిగా కురుస్తున్న ఈ వర్షాలకు  లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.


ఆయా ప్రాంతాల్లో పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. ఈ వర్షాల సమయంలో, మనం తీసుకునే ఆహారంతో పాటు త్రాగే నీరు, పీల్చేగాలి కలుషితం అయ్యి, మన ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నాయి. ఈ కాలాంలో ఏ మాత్రం ఎమరుపాటు గున్న రోగాల పాలవ్వడం ఖాయం.. ఈ రోగాలవల్ల ఒక్కోసారి ప్రాణాలు కూడ ప్రమాదంలో పడతాయి. కావున ఇప్పటికైన అధికారులు సరైన చర్యలు తీసుకుని  ఆరోగ్యాలను రక్షించవలసిందిగా సగటు ప్రజలు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: