ఇటీవల  తేజాస్‌ రైలును ప్రవేశపెట్టిన విషయం అందరికి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో 150 రైళ్లు..50 స్టేషన్లు ప్రైవేటుపరం చేయడానికి సిద్ధం అయంది. భారత రైల్వేల ప్రైవేటీకరణ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. తేజాస్‌ రైలును ప్రవేశపెట్టిన అనంతరం తాజాగా మరో 150 రైళ్లు, 50 రైల్వే స్టేషన్లను దశలవారీగా ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించాలని కేంద్రం  నిర్ణయం తీసుకుంది. కేంద్ర నిర్ణయం గురించి నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను ముందకు తీసుకువెళ్లేందుకు సాధికార కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుందని లేఖలో కాంత్‌ తెలిపారు. 


దేశవ్యాప్తంగా ఆరు విమానాశ్రయాల ప్రైవేటకీరణ అనుభవాన్ని ప్రస్తావిస్తూ రైల్వేల్లోనూ ఇదే తరహాలో ప్రైవేటీకరణ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు  కార్యదర్శులతో కూడిన సాధికార కమిటీ ఏర్పాటవుతుందని రైల్వే బోర్డు ఛైర్మన్‌ వీకే యాదవ్‌కు రాసిన లేఖలో అమితాబ్‌ కాంత్‌ తెలియచేశారు. ప్రయాణీకుల రైళ్ల నిర్వహణను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించే ప్రక్రియతో ఈ రైళ్ల నిర్వహణలో సమూల మార్పులు చేసుకుంటుంది అని తెలియచేసింది.


ఈ ప్రాజెక్టులను సమర్థవంతంగా అమలు చేసేందుకు కాను రైల్వే బోర్డుకు చెందిన ఇంజనీరింగ్ సభ్యుడు, ట్రాఫిక్ సభ్యుడితో ఒక గ్రూపు ఏర్పాటు చేయాలని  సూచించినట్లు ఆయన తెలిపారు. ఇది ఇలా ఉండగా ఆర్థికంగా, నిర్వహణాపరంగా వెసులుబాటు ఉన్న కొన్ని రైల్వే రూట్లను ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రైవేటుపరం కానున్న 24 రూట్లను ప్రాథమికంగా ఖరారు చేసినట్లు వర్గాలు తెలిపారు 


ఈ రూట్లలో దూర ప్రయాణం, రాత్రి ప్రయాణం, ఇంటర్-సిటీ రైళ్లు, సబర్బన్ రైళ్లు ఉన్నట్లు కనిపిస్తుంది. రాత్రి పూట, దూర ప్రయాణం సాగించే రూట్లలో ఈ రైళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-లక్నో, ఢిల్లీ-జమ్మూ/కాట్రా, ఢిల్లీ-హౌరా, సికింద్రాబాద్-ఢిల్లీ, ఢిల్లీ-చెన్నై, ఢిల్లీ-చెన్నై, ముంబై-చెన్నై, హౌరా-చెన్నై, హౌరా-ముంబై.
ఇంటర్ సిటీ రైళ్లు: ముంబై-అహ్మదాబాద్, ముంబై-పుణె, ముంబై-ఔరంగాబాద్, ముంబై-మడ్గావ్, ఢిల్లీ-చండీగఢ్/అమృత్‌సర్, ఢిల్లీ-జైపూర్/అజ్మీర్, హౌరా-పూరి, హౌరా-టాటా, హౌరా-పాట్నా, సికింద్రాబాద్-విజయవాడ, చెన్నై-బెంగళూరు, చెన్నై-కోయంబత్తూరు, చెన్నై-మదురై, ఎర్నాకుళం-త్రివేండ్రం. సబర్బన్ రైళ్లు: ముంబై, కోల్‌కతా, చెన్నై, సికింద్రాబాద్.


మరింత సమాచారం తెలుసుకోండి: