వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మొట్ట మొదటి చేసిన పని వృద్ధుల, వితంతవుల పెన్షన్లు పెంచడం. రూ. 2 వేలు ఉన్న వృద్ధాప్య, వితంతు పెన్షన్లను రూ.2.250కి పెంచారు. అలాగే వికలాంగులకు రూ.3000, కిడ్నీ బాధితులకు రూ.10 వేలు పెన్షన్లు అమలు చేశారు. ఇక వృద్ధాప్య, వితంతు పెన్షన్లను ఏడాదికి రూ.250 చొప్పున పెంచుకుంటూ వెళ్లనున్నారు.


అయితే చంద్రబాబు సీఎం అవగానే పెన్షన్ రూ. 1000 చేశారు. కానీ ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్...తాను అధికారంలోకి రాగానే వెయ్యి రూపాయాలని 2 వేలు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో చంద్రబాబు ఎన్నికలకు నాలుగు నెలలు ఉన్న సమయంలో పెన్షన్ రెండు వేలుకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఎన్నికలని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే దీనికి బదులుగా జగన్...తాను అధికారంలో రాగానే 2 వేల పెన్షన్ ని 3 వేల వరకు పెంచుకుంటూ పోతానని బాబుకు గట్టి కౌంటర్ ఇచ్చారు.


ఎన్నికల్లో కూడా ప్రజలు చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నమ్మలేదు. జగన్ పై నమ్మకంతో వైసీపీని బంపర్ మెజారిటీతో గెలిపించారు. ఇక తనని గెలిపించిన ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ...జగన్ సీఎం అవగానే పెన్షన్లు పెంచారు. దీంతో ఒక్కసారే రూ. 2,250 రావడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. కాకపోతే కొందరు పెన్షన్ దారులు ఒక్కసారే 3వేలు వస్తాయని ఆశించారు. కానీ గతం కంటే రూ. 250 పెరిగే సరికి కొందరు నిరాశకు గురయ్యారు. అయితే అదే రూ.250 పెరిగాయని చాలామంది ఆనందం వ్యక్తం చేశారు.


పైగా గ్రామ వాలంటీర్ల ద్వారా వారి ఇంటికొచ్చి నేరుగా పెన్షన్లు ఇవ్వడంతో జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చేప్పుడు వృద్ధులు, వితంతువులు దగ్గర రూ.10, 20 కమిషన్లు తీసుకునేవారు. జగన్ మాత్రం పారదర్శకంగా ప్రతి రూపాయి లబ్దిదారునికి అందేలా చర్యలు తీసుకున్నారు. మొత్తానికి పెన్షన్లు పెంపు జగన్ ప్లస్ అయిందనే చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: