ఊహించని నిర్ణయాలు, సరికొత్త సంక్షేమ పథకాలతో పాలనలో దూసుకుపోతున్న సీఎం జగన్…త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకుని సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. అందులోనూ తమకు అండగా ఉండే రాయలసీమపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మొన్న ఎన్నికల్లో రాయలసీమలో ఉన్న 52 అసెంబ్లీ సీట్లలో వైసీపీ 49 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. అటు 8 లోక్ సభ స్థానాలని కైవసం చేసుకున్నారు. ఇక టీడీపీ అయితే కేవలం మూడు అసెంబ్లీ సీట్లనే గెలుచుకుంది.


చిత్తూరు కుప్పంలో చంద్రబాబు, అనంతపురం హిందూపురంలో బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ లు మాత్రమే గెలిచారు. కర్నూలు, కడప జిల్లాలో ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. అయితే ఓటమి పాలైన దగ్గర నుంచి టీడీపీ నేతలు సైలెంట్ అయిపోయారు. అసలు రాయలసీమలో టీడీపీ మాట కూడా వినపడటం లేదు. సీమ మొత్తం టీడీపీ శ్రేణులు పూర్తి నైరాశ్యంలో ఉండిపోయారు. అయితే ఈ నైరాశ్యాన్ని తమ పార్టీకి అనుకూలంగా మలుచుకుని జగన్ స్థానిక, మున్సిపాలిటీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని అనుకుంటున్నారు.


అందుకే అనంతపురం జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలపై జగన్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ని పార్టీలోకి తీసుకురావడానికి చూశారు గానీ....చంద్రబాబు కేశవ్ కు పి‌ఏ‌సి ఛైర్మన్ పదవి ఇచ్చి, టీడీపీలోనే కొనసాగేలా చేశారు. అటు టీడీపీ కంచుకోట హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య సినిమాల్లో బిజీగా ఉన్నారు. కాబట్టి సైలెంట్ గా ఆ నియోజకవర్గంలో పాగా వేయాలనుకుంటున్నారు. అక్కడ ఎక్కువగా ఉండే మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.


ఇటీవలే బాలయ్య చేతిలో ఓడిపోయిన ఇక్బాల్ కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దీంతో పాటు టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులని పార్టీలోకి తీసుకోవడం మొదలుపెట్టారు. అయితే బాలయ్య నియోజకవర్గాన్ని పట్టించుకోకపోతే రానున్న స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమే. జగన్ అనుకున్న టార్గెట్ సక్సెస్ అవ్వడం గ్యారెంటీ.



మరింత సమాచారం తెలుసుకోండి: