జగన్ చేయని తప్పుకు, నీచ రాజకీయానికి పదహారు నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఆయన చేసిన ఒకే ఒక తప్పు. రాజకీయంగా బలంగా ఉన్న కొండలను ఢీ కొట్టడం. ఇక జగన్ మీద ఆనాడు పెట్టిన ఏ ఒక్క కేసు కూడా నిలబడే అవకాశాలు లేవని ఆ కేసులను చూసిన దర్యాప్తు  అధికారులే బాహాటంగా చెబుతున్నారు. మరో వైపు తలపండిన న్యాయనిపుణులు సైతం జగన్ కేసులు రాజకీయం కోసం తప్ప నిలిచేవి కావని తేల్చేస్తున్న పరిస్థితి. మరి ఇవన్నీ ఇలా ఉంటే జగన్ మళ్ళీ జైలుకి వెళ్తారా...


ఇది తెలుగు తమ్ముళ్ల ఆశ. జగన్ మీద ఆరోపణల విషయంలో డొల్లతనాన్ని టీడీపీ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, మైసూరారెడ్డిఏనాడో  చెప్పనే చెప్పారు. భారీగా ఉంటుందని, జనాలను ఆకట్టుకుంటుందని లక్ష కోట్ల ఫిగర్ ని తెలుగుదేశం అధినాయకత్వం  వేయమంటే వేశామని వారే చెప్పారు. అంటే అంత డొల్లగా జనంలో జగన్ని బద్నాం చేయాలన్న విషపు ఆలోచనలతో కేసులు పెట్టించారని అర్ధమైపోయింది. 


ఇక జగన్ పై కేసులు పెట్టిన సమయం, సందర్భం తీసుకున్నా అవి అసలు నిలబడవని ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు ఏనాడో చెప్పారు. రీసెంట్ గా జగన్ మీద కేవలం 1300 కోట్ల రూపాయల ఆరోపణలే ఉన్నాయని నాడు ఆ కేసులు చూసినా సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కూడా చెప్పారు. ఇంతమంది ఇన్ని విధాలుగా చెబుతున్నా తెలుగు తమ్ముళ్ళకు మాత్రం జగన్ మీద కసి ఇంకా పోయినట్లు లేదు. 


జ‌గన్ జైలుకు వెళ్తారని ఈ రోజు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఘాట్ కామెంట్స్ చేశారు. జగన్ జైలుకు వెళ్ళడం ఖాయమంటూ ఆయన జోస్యం చెబితే మిగతా తమ్ముళ్ళు ఆనందపడ్డారు. మరి జగన్ ఎందుకు జైలుకు వెళ్తారో సదరు మాజీ మంత్రి చెప్పకపోవడం దారుణమే.



మరింత సమాచారం తెలుసుకోండి: