భవిష్యత్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేసినట్లే కనబడుతోంది. జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ గనుక వర్కవుటైతే  ప్రతిపక్షాలు ప్రధానంగా చంద్రబాబునాయుడు పని గోవిందా అనే చెప్పాలి. ఇంతకీ  ఆ మాస్టర్ ప్లాన్ ఏమిటయ్యా అంటే సంక్షేమ పథకాల అమలు ద్వారా నేరుగా ప్రజలతోనే పొత్తు పెట్టేసుకోవటం. 

 

మామూలుగా ప్రభుత్వాలు అమలు చేసే ప్రతీ సంక్షేమ పథకం క్లిక్ కావన్న విషయం అందరికీ తెలిసిందే. పథకాలు ఎన్ని అమలు చేస్తున్నా అందులో పేరు తెచ్చిపెట్టేవి ఏ ఒకటో రెండో ఉంటాయంతే. అందుకనే జగన్ మాత్రం ప్రతి పథకం క్లిక్ అయ్యేందుకు జాగ్రత్తగా ప్లాన్ వేస్తున్నారు. పైగా పథకాల అమలులో పెద్దగా ప్రచారం చేసుకోకుండానే మ్యాగ్జిమమ్ లబ్ది పొందాలన్నది జగన్ వ్యూహంగా కనబడుతోంది.

 

చంద్రబాబు హయాంలో గోరంత పనికి కొండంత పబ్లిసిటి చేసుకున్న విషయం అందరూ చూసిందే.  అందుకనే చంద్రబాబు ప్రవేశపెట్టిన ప్రతి పథకం అర్హులకు కాకుండా దళారీల చేతుల్లో పడింది. దాంతో అర్హులు మండిపోయి మొన్నటి ఎన్నికల్లో గూబగుయ్యిమనిపించారు. టిడిపి ప్రభుత్వ హయాంలో జరిగిందే తిరిగి పునరావృతం కాకుండా  జగన్ జాగ్రత్తపడుతున్నారు.

 

తాజాగా మొదలైన వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్నే తీసుకుంటే సుమారు 2 కోట్లమందికి కంటి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కంటి పరీక్షలు మాత్రమే కాకుండా అవసరమైన వాళ్ళకు కళ్ళజోళ్ళు ఇవ్వాలని కూడా డిసైడ్ చేశారు. ఇందులో దాదాపు 70 లక్షల మంది విద్యార్ధులకు కూడా పరీక్షలు చేయనున్నారు.

 

అలాగే నామినేటెడ్ పదవులు, రూ. 5 లక్షల లోపు నామినేటెడ్ వర్కుల్లాంటి వాటిని ఎస్సీ, ఎస్టీ, బిసి, కాపు, మైనారిటి, మహిళలకు రిజర్వు చేస్తు చట్టం కూడా చేశారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో యువతకు పెద్ద పీట వేశారు. ఇందులో కూడా మహిళలే ఎక్కువగా నియమితులయ్యారు. వీళ్ళు గనుక సక్రమంగా విధులు నిర్వర్తిస్తే జగన్ తన లక్ష్యాన్ని చేరుకున్నట్లే లెక్క. అమ్మఒడి పథకం కూడా ఇటువంటిదే.


పథకం ఏదైనా డైరెక్టుగా లబ్దిదారులతోనే కాంటాక్టు పెట్టుకోవటం ద్వారా మ్యాగ్జిమమ్ లబ్దిపొందాలన్నదే జగన్ వ్యూహం. మరి ఈ వ్యూహం ఎంత వరకూ వర్కువటవుతుందో రానున్న ఎన్నికల్లో బయటపడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: