నగరంలో సరఫరా అవుతున్న నీరు  బాగోలేదంటూ... ఆ నీటితో బట్టలు వాషింగ్ చేస్తే  పాడవుతాయని... ఐదు రోజులపాటు బట్టలు ఉతకాకూడదు అంటూ  అధికారులు నగర ప్రజలను  హెచ్చరిస్తున్నారు. ఒకవేళ హెచ్చరిక పట్టించుకోకుండా బట్టలు పిండితే  పాడవుతాయి అని చెప్తున్నారు. అదేంటి అధికారులు బట్టలు ఉతకొద్దు  అనడం ఏంటి అనుకుంటున్నారు కదా... ఈ ప్రకటన మన దగ్గర కాదులేండి... అమెరికా నార్త్ కరోలినా లోని  సర్ఫ్ సిటీలో . సర్ఫ్  సిటీ లోని స్థానిక  పాలనాధికారులు ... ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టారు. ఐదు రోజుల పాటు నగరవాసులు బట్టలు ఉతకకూడదు అని  సూచించారు. 

 

 

 

 

 అయితే అధికారులు పెట్టిన పోస్టు అర్థం ఏమిటంటే... స్థానికంగా వాడుతున్న వాటర్ లో ఇనుము  శాతం ఎక్కువగా ఉన్నట్లు స్థానిక పాలన అధికారులు గుర్తించారు. అలాంటి నీటితో నగరవాసులు బట్టలు ఉతికితే బట్టలు పాడైపోతాయని  భావించిన అధికారులు ఫేస్ బుక్ లో ఇలాంటి సూచనలు చేశారు. అయితే ఎక్కువమంది  వాషింగ్ మిషన్ ట్యాప్ ఆన్ చేసి బట్టలు వాషింగ్ మెషిన్ లో వేసి వేరే పనులు చేసుకుంటారు కాబట్టి. నగరవాసుల అందరికీ తెలిసేలా  ఫేస్ బుక్ లో  ఈ పోస్ట్ పెట్టారు స్థానిక పాలన అధికారులు. బట్టలు  పాడవకుండా ముందు జాగ్రత్తగా ఈ పోస్టు  పెట్టినట్లు అధికారులు తెలిపారు. 

 

 

 

 

 కాగా  ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టిన అధికారుల తీరును అక్కడి నగరవాసులు కొందరు తప్పు పడుతున్నారు. ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని ప్రజలకు నేరుగా తెలియజేయకుండా ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టడం ఏంటని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా స్థానిక పాలన అధికారులు పెట్టిన పోస్ట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ప్రజలు  అధికారులు ఈ పోస్ట్ పెట్టినందుకు కృతజ్ఞతలు చెబుతుంటే... కొంతమంది ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని ఫేస్ బుక్ లో  పెడతారా...నేను  ఫేస్ బుక్  వాడక ఎన్ని రోజులైందో ... ఈ సమాచారం అసలు తనకు తెలియదు అని  ఓ వ్యక్తి స్పందించాడు. అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 11 వరకు ఇలాంటి నిబంధనలు విధించారు అక్కడి అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: