తెలంగాణాలో కేసీయార్ ని కాదని ఇప్పటివరకూ ఏ పార్టీ నిలబడలేకపోయింది. దానికి కేసీయార్ అపరిమితమైన చరిస్మా ప్రధాన కారణం. ఉద్యమనాయకుడిగా కేసీయార్ని జనం గుండెల్లో పెట్టుకున్నారు. కేసీయర్ కంటే నమ్మదగ్గ నాయకుడు కూడా కనిపించకపోవడం మరో కారణం. ఇక కేసీయార్ పోరాడింది ఇపుడున్న అన్ని పార్టీల మీద, వాటి  నాయకులు అందరిమీద. దాంతో సహజంగా కేసీయార్ వైపు నుంచి ఆలోచించిన  తెలంగాణా జనానికి వారు కూడా శత్రువులుగా మారిపోయారు. 


ఇవన్నీ ఇలా ఉంటే కేసీయార్ ఇపుడు ఒక్కో వర్గానికి శత్రువుగా కనిపిస్తున్నాడు. దానికి పరోక్షంగా జగన్ కారణం కావడం విశేషం. జగన్ భుజంపైన చేయి వేసి కేసీయర్ ఎన్నో కబుర్లు చెప్పవచ్చు కానీ తెలంగాణా జనం ద్రుష్టిలో మాత్రం జగన్ ఇపుడు మెల్లగా హీరోగా మారిపోతున్నాడు. తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కాదు కానీ జై జగన్ అన్న నినాదాలు తెలంగాణావ్యాప్తంగా  వినిపిస్తున్నాయి. ఇది ఏ విధంగానూ టీయారెస్ నాయకత్వం కానీ, కేసీయార్ కానీ సహించలేని విషయమే. తెలంగాణాలో తమకు ఏ పార్టీ కానీ నాయకుడు కానీ పోటీ కాదు అని అనుకుంటున్న టీయారెస్ నాయకత్వానికి ఇపుడు జై జగన్ నినాదాలు కలవరపెడుతున్నాయి.


ఆర్టీసీని చిన్నవాడు అయినా కొత్త సీఎం అయినా కూడా జగన్ ప్రభుత్వంలో విలీనం చేశారు మరి కేసీయార్ ఎందుకు చేయరు ఇది కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టుల వరకూ అందరి నుంచి నిలదీతగా వస్తున్న ప్రశ్న. అదే విధంగా ఏపీలో లక్షల ఉద్యోగాలు జగన్ ఇచ్చారు. కేసీయార్ మాత్రం ఎందుకు ఇవ్వలేకపోతున్నారన్నది అక్కడ ఉన్న యువత ప్రశ్న. ఏపీలో ఫీజ్ రీఅంబర్స్మెంట్ ఇచ్చి విద్యార్ధులకు చదువుకునే అవకాశం జగన్ సర్కార్ ఇస్తోంది మరి కేసీయార్ ఎందుకు ఆ పని చేయరు, ఆరోగ్యశ్రీ పేరిట  అన్ని రకాల వ్యాధులను విస్తరించి వైద్యం జగన్ అందుబాటులోకి తెస్తుంటే తెలంగాణాలో ఎందుకు చేయరు, రైతాంగానికి  అన్ని రకాలుగా జగన్ మేలు చేస్తూంటే తెలంగాణాలో ఆ స్కీమ్స్ ఎందుకు చేయరు.


ఇల ఒక్కొ సెక్షన్ ఇపుడు ఏపీని చూపిస్తూ కేసీయార్ని నిందిస్తోంది. యూత్,  స్టూడెంట్స్ అయితే సోషల్ మీడియా వేదికగా చేసుకుని కేసీయార్ని పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారుట. జగన్ తెలంగాణాలో కూడా వైసీపీని విస్తరించు, ఇక్కడ కూడా అధికారం ఇస్తామంటోందిట  అక్కడ యువత, ఇంతటి సానుకూల వాతావరణం ఉంటే పార్టీని ఇక్కడ పరుగులు పెట్టించండి అంటున్నారుట తెలంగాణా వైసీపీ నేతలు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ ఇలా అన్న్ పార్టీలూ తెలంగాణా జనం మన్ననలు పొందని చోట జగన్ని రమ్మని పిలుస్తోంది తెలంగాణా.మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: