నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.. ప్రపంచంలోనే రెండు అతి పెద్ద జనాభా ఉన్న దేశాలు.. ప్రపంచంలోని సగం జనాభా ఈ రెండు దేశాల్లోనే ఉంది. అందులోనూ రెండూ ఇరుకు పొరుగు దేశాలు. కానీ ప్రస్తుతం కాశ్మీర్ సమస్య నేపథ్యంలో చైనా పాక్ ను సపోర్ట్ చేసేలా ఉంది. ఎంత కాదన్నా చైనాకు పాకిస్తాన్ మిత్రుడు.


ఇలాంటి నేపథ్యంలో ఈ రెండు దేశాధినేతల మీటింగ్ అంటే.. చాలా ఊహించుకుంటారు. వాడి వేడి చర్చలు.. దేశాధినేతలుగా వారి హంగూ ఆర్భాటం.. సీరియస్ డిస్కషన్ ఇలా ఉంటుందనుకుంటారు. కానీ శుక్రవారం.. మోదీ, జిన్ పింగ్ ల సమావేశం జరిగిన తీరు చూస్తే ఇంత వెరైటీగా కూడా ఇద్దరు దేశాధినేతల మీటింగ్ జరుగుతుందా అనిపించక మానదు.


వీరి సదస్సుకు వేదికైన మహాబలిపురంలో ఈ దేశాధినేతలిద్దరూ పాతకాలం స్నేహితుల్లా ఆ ప్రాంగణమంతా కలియదిరిగారు. కట్టడాల సముదాయంలో నడుచుకుంటూ మాట్లాడుకున్నారు. కట్టడాల విశిష్టతలను మోడీ వివరిస్తుంటే జిన్ పింగ్ ఆసక్తిగా వీక్షించారు. మహాబలిపురం లోని రాతి కట్టడాల మీద చెక్కిన పురాణ గాధల గురించి మోడీ చైనా అధ్యక్షుడికి వివరించారు.


పరమశివుడి నుంచి.. అర్జునుడు పాశుపతాస్త్రం పొందే శిల్పం గురించి కొద్దిసేపు ముచ్చటించారు. ఏకశిల కట్టడాలైన ఐదు రథాలు వంటి వాటిని మోడీ చాలా సేపు జిన్ పింగ్ కు వివరించారు. ఆ తర్వాత ఇద్దరూ యునెస్కో గుర్తింపు పొందిన షోర్‌ మందిరాన్ని కూడా వీక్షించారు.


అలా దాదాపు గంటన్నర సేపు మోడీ, జింగ్ పింగ్ ఆ ప్రాంగంణంలో తిరుగుతూనే ఉన్నారు. ఆ తర్వాత పంచరథ సముదాయంలో మోడీ , జిన్‌పింగ్‌ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో మోదీ, జిన్ పింగ్ కొబ్బరి బోండాలు తాగారు. మోడీ స్వయంగా జిన్‌పింగ్‌కు కొబ్బరిబోండం అందించారు. ఆ తర్వాత కళాకారుల ప్రదర్శన జరిగిది. ఇందులో కళాకారుల రామాయణ ఘట్టాన్ని వివరిస్తుంటే మోడీ ఆనంద పరవశుడయ్యాడు. జిన్ పింగ్ కూడా చాలా ఆసక్తిగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: