ఆర్టీసీ ని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం లో విలీనం చేస్తూ , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరోక్షంగా ఆత్మరక్షణ లో  నెట్టారు . అప్పుల్లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లోనే ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయగా లేనిది ... ధనిక రాష్ట్రమైన  తెలంగాణ లో ఎందుకు చేయరంటూ ఆర్టీసీ కార్మికులు ఈ నెల ఐదవ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె బాటపట్టారు . అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ససేమిరా అనడమే కాకుండా, సమ్మెకు వెళ్లిన కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు .

ముఖ్యమంత్రి వైఖరితో ఆగ్రహించిన ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెను ఉదృతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు . దానిలో భాగంగానే రాజకీయ పార్టీలు , ప్రజాసంఘాలు , ప్రభుత్వ ఉద్యోగ సంఘాల మద్దతు కోరుతున్నారు . అయితే రాష్ట్ర విభజన జరిగిన కార్మికులంతా ఒక్కటేనని ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీసీ కార్మికులు చెప్పకనే చెబుతున్నారు . ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ తో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్న నేపధ్యం లో,  తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సంఘీభావాన్ని ప్రకటించాలని నిర్ణయించారు  .  తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు   సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఈ నెల 13 వతేదీన ధర్నా చేయనున్నట్లు వెల్లడించారు .

ఆంధ్ర ప్రదేశ్ లోని 13 జిల్లాల్లోని 128  డిపోల్లో జే ఏ సీ అద్వర్యం లో ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు . ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయడం ద్వారా   కేసీఆర్ ను పరోక్షంగా  జగన్ మోహన్ రెడ్డి ఆత్మరక్షణ లోకి నెట్టగా , ఇప్పుడు సమ్మె చేస్తోన్న తెలంగాణ  ఆర్టీసీ కార్మికులకు , ఏపీ ఆర్టీసీ కార్మికులు సంఘీభావం ప్రకటిస్తూ ఈ నెల  13  న ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించి  కేసీఆర్ ను మరింత  ఇరకాటం పెడుతున్నారు  


మరింత సమాచారం తెలుసుకోండి: