పవన్ కళ్యాణ్ గంగా ప్రక్షాళన ఉద్యమానికి రెడీ అవుతున్నారా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు.  గంగానదిని స్వేచ్ఛగా ఎలాంటి కలుషితం కాకుండా ప్రవహింపజేయాలని కోరుతూ జెడి అగర్వాల్ ఆమరణ నిరాహార దీక్ష చేశారు.  మాత్రి సదన్ వేదికగా అయన నిరాహార దీక్ష చేపట్టారు.  కానీ, ఏ ప్రభుత్వమూ కూడా ఆయన దీక్షను పట్టించుకోలేదు.  ప్రజల నుంచి కూడా స్పందన లేకపోవడం విశేషం.  


అయన త్యాగం ఊరికే పోయింది.   ఆమరణ దీక్ష చేస్తూ అగర్వాల్ మరణించి సంవత్సరం అయ్యింది.  అయినప్పటికీ ఏ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడం విశేషం.  అగర్వాల్ ప్రధమ వర్ధంతి సందర్భంగా పవన్ కళ్యాణ్  హరిద్వార్ వెళ్లారు.  అక్కడ మాత్రి ఆశ్రమంలోని అయన సమాధికి అంజలి ఘటించారు.  ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నారు.  గంగా ప్రక్షాళన విషయంలో పవన్ కళ్యాణ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని సమాచారం.  


పవన్ తనదైన శైలిలో గంగ ప్రక్షాళన విషయంలో పోరాటం చేయబోతున్నట్టు తెలుస్తోంది.  అయితే, ఎంచేయబోతున్నారు .. ఎలా ప్రక్షాళన కోసం అడుగు ముందుకు వేయబోతున్నారు అన్నది స్పష్టం తెలియలియాల్సి ఉన్నది. గతంలో చాలామంది గంగ ప్రక్షాళన కోసం పోరాటం చేశారు. ప్రాణ త్వాగం చేశారు.  కానీ, యథేచ్ఛగా గంగానదిలో కలుషిత రసాయనాలు కలుస్తూనే ఉన్నాయి.  ఫలితంగా కలుషితంఅవుతున్నది .  పరివాహక ప్రాంతాల్లో తాగేందుకు ఈ నీటిని ఉపయోగించలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  


పవన్ కు దేశవ్యాప్తంగా మంచి పేరు ఉన్నది.  ఇప్పుడు రాష్ట్ర సమస్యలు కంటే పవన్ గంగానది ప్రక్షాళన విషయంలో పోరాటం చేయడం మొదలుపెడితే.. అయన వెంట నడిచేందుకు చాలామంది ముందుకు వస్తారు.  అటు ప్రభుత్వం కూడా గంగను ప్రక్షాళన చేయడానికి ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటు చేసింది.  ఆ శాఖ పనిచేస్తున్నా.. ప్రక్షాళన విషయంలో కొంత అలసత్వం ప్రదర్శిస్తూనే ఉన్నది.  ఫ్యాక్టరీల నుంచి వచ్చే రసాయనాల కారణంగానే ఎక్కువగా గంగానది కలుషితం అవుతున్నది.  దీంతో పాటు, వారణాసిలో సగం కాలిన శవాలను గంగానదిలో కలిపేయడం వలన కూడా గంగ కలుషితం అవుతున్నది. 


మరింత సమాచారం తెలుసుకోండి: