మళ్ళీ పఠాన్ కోట్ లో హై అలర్ట్ ప్రకటించారు.  గత కొన్ని రోజులుగా పాక్ నుంచి ఇండియాలోకి డ్రోన్ లు వస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.  ఈ డ్రోన్ లనుంచి పేలుడు పదార్దాలు, మందుగుండు సామాగ్రి, డబ్బు వంటివి వాటిని పాక్ నుంచి ఇండియాలోకి అక్రమంగా పంపుతున్నారని పోలీసులు, ఆర్మీకి సమాచారం అందటంతో.. పంజాబ్, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ తదితర ఏరియాల్లో హై అలర్ట్ ప్రకటించి తనిఖీలు చేస్తున్నారు. 

ఇప్పటికే పంజాబ్ లో ఫిరోజ్ పూర్ ఏరియాలో రెండుసార్లు డ్రోన్లు కనిపించినట్టు అక్కడి ప్రజలు చెప్పారు.  కొన్ని డ్రోన్స్ లను ఇప్పటికే ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది.  ఒకవేళ డ్రోన్స్ లనుంచి పేలుడు పదార్ధాలను ఇండియాలోకి జారవిడిస్తే దానివలన పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.  గతంలో పాక్ ఉగ్రవాదులు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో కలకలం సృష్టించారు.  పఠాన్ కోట్ లోకి అక్రమంగా చొరబడి ఎయిర్ బేస్ ను విధ్వంసం చేయాలని చూశారు.  


ఇండియన్ ఆర్మీ వారి ఎత్తుగడను సమర్ధవంతంగా తిప్పికోట్టింది.  ఎయిర్ బేస్ లోకి ప్రవేశించిన ఉగ్రవాదులను మట్టుబెట్టింది.  దాదాపు మూడు రోజులకు పైగా ఈ ఆపరేషన్ జరిగింది.  పఠాన్ కోట్ దాడుల తరువాత పాకిస్తాన్ లో ఇండియా సర్జికల్ స్ట్రైక్స్ చేసి పీవోకే లో ఉన్న పాక్ ఆర్మీ క్యాంపులను ధ్వంసం చేసింది.  కాగా, ఇప్పుడు ఇదేతరహా పేలుళ్లు సృష్టించేందుకు పాక్ ఎత్తుగడలు వేస్తున్నట్టు తెలుస్తోంది.  ఇండియాలో అక్రమంగా ఇప్పటికే 300 మందికి పైగా ఉగ్రవాదులు చొరబడ్డారని సమాచారం.  


వీరు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ను లక్ష్యంగా చేసుకున్నారని సమాచారం.  ఒకవేళ ఇదే జరిగితే.. మరోమారు ఇండియా పాక్ పై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించడమే కాదు.. అవసరమైతే పీవోకే ను తిరిగి ఆక్రమించుకోవడానికి సిద్ధం  అవుతుంది.  అందులో సందేహం అవసరం లేదు.  ఇప్పుడు ఇండియా ముందు ఉన్న లక్ష్యం ఇదే.  ఇండియాను సురక్షితంగా ఉంచడంతో పాటు శతృవులను తరిమికొట్టడమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ పనిచేస్తున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: