మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉండాలి అంటే.. చుట్టూ ఉన్న పర్యావరణం  పరిశుభ్రంగా ఉండాలి.  గాలిలో ఎక్కువగా ఆక్సిజన్ ఉండాలి.  ఎలాంటి కలుషితం కానీ నీరు ఉండాలి.  చుట్టూ పచ్చని చెట్లు ఉండాలి.  అప్పుడే ఏదైనా సాధ్యం అవుతుంది. సాధ్యంగాని విషయం అంటూ ఏది ఉండదు.  పర్యావరణ పరిరక్షణ కోసం మోడీ ప్రభుత్వం అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.  ఇప్పుడు మనం పర్యావరణాన్ని కాపాడుకుంటే.. భవిష్యత్తులో ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  


అందుకే కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు.  ఇందులో భాగంగానే మొక్కల పెంపకం, ప్లాస్టిక్ నిషేధం.  సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను ఇప్పటికే నిషేదించింది.  సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించడం వలన కొంతవరకు పర్యావరణం నుంచి రక్షించబడినట్టే అవుతుంది.  పర్యావరణం నుంచి రక్షించబడాలి అంటే తప్పకుండా ఈ ప్లాస్టిక్ ను నిషేదించాల్సిందే.  


అంతేకాదు, పెట్రోల్, డీజిల్ వంటి బండ్లను ఎక్కువగా వినియోగించడం వలన కూడా పర్యావరణం పాడైపోతుంది.  ఒకప్పుడు ప్రయాణానికి ఎద్దుల బండిని, గుర్రపు బండిని, గుర్రాలను వినియోగించేవారు.  అంతేకాదు, పబ్లిక్ వాహనాలను ఎక్కువగా వాడేవారు తప్పించి, ప్రైవేట్ వాహనాలు వాడేందుకు అంతగా ఆసక్తి చూపేవారు కాదు.  కానీ, ఇప్పుడు కాలం మారిపోయింది.  ప్రతి ఒక్కరు రెండు మూడు వాహనాలు వాడుతున్నారు.  వాహనాల సంఖ్య పెరిగిపోతున్నది.  వాహనాల సంఖ్య పెరగడం వలన పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి.  


దీనికి ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రభుత్వం అన్వేషితోంది.  అయితే, ఇటీవలే పూణేలో ప్రముఖ వాహన సంస్థ ఓ ఆటో ను తయారు చేసింది.  కెనటిక్ సఫర్ స్టార్ అనే పేరుతో ఆటోను తయారు చేశారు.  ఈ ఆటో పర్యావరణానికి ఎలాంటి నష్టం చేయదు. దీని నుంచి కలుషితమైన పొగ వెలువడదు.  ఈ ఆటో బ్యాటరీ సహాయంతో నడుస్తుంది.  ఒక్కసారి ఫుల్ గా చార్జీ చేస్తే.. 130 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తుంది.  40 ఓల్ట్ లిథియం బ్యాటరీతో 150 ఏంఏహెచ్ సామర్ధ్యంతో పనిచేస్తుంది.  మారుమూల పల్లెల్లో సైతం ప్రయాణం చెయ్యొచ్చు.  శబ్దరహిత, కాలుష్య రహిత వాహనం కాబట్టి ప్రభుత్వం నుంచి తప్పకుండా ప్రోత్సాహకాలు ఉంటాయని అనుకోవచ్చు.  కిలోమీటర్ కు కేవలం 50 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: