ఇండియా.. పాకిస్తాన్ దేశాల మధ్య ప్రస్తుతం యుద్ధం జరగకపోయినా.. యుద్ధం జరిగేంతగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.  రెండు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి.  ఇండియాలో పరిస్థితులు చాలా వరకు కంట్రోల్ లోనే ఉన్నాయి.  ఎప్పుడు కూడా ఇక్కడ అల్లకల్లోలం జరగడం అన్నది లేదు.  అయితే, పాక్ లో అలా కాదు.. నిత్యం ఎక్కడో ఒకచోట బాంబుపేలుళ్లు వంటివి జరుగుతూనే ఉన్నాయి.  


సొంతం దేశంలోనే ఉగ్రవాదుల నుంచి రక్షించుకోలేకపోతున్న పాక్, కాశ్మీర్ విషయం గురించి మాట్లాడుతూ.. కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవడానికి సిద్ధం అవుతున్నది.  అది ఎంతవరకు న్యాయం అంటారు.  కాశ్మీర్ విషయంలో ఇండియాపై ఎప్పుడు ఒంటికాలిపై లేచేందుకు సిద్ధం అవుతుంటుంది.  కానీ, ప్రపంచంలోని ఏ ఒక్క దేశం కూడా పాక్ కు సపోర్ట్ చేయడం లేదు.  చివరకు ముస్లిం దేశాలు కూడా పాక్ విషయంలో వ్యతిరేకిస్తున్నాయి.  


ఇక ఇదిలా ఉంటె, ఇండియాలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పర్యటిస్తున్నారు.  నిన్నటి రోజున మహాబలిపురం వచ్చారు.  అక్కడే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని మోడీలు సమావేశం అయ్యారు.  ఈరోజు కూడా మహాబలిపురంలో మరోమారు సమావేశంకాబోతున్నారు .  రెండు దేశాల మధ్య బోర్డర్ విషయంలో ఇరు నేతలు చర్చించే అవకాశం ఉన్నది.  రెండు దేశాల మధ్య జరిగే చర్చలు తరువాత ఇరు నేతలు జాయింట్ గా ప్రెస్ తో మాట్లాడే అవకాశం ఉన్నది.  


ఈ రెండు దేశాల మధ్య ఏం జరగబోతున్నది. ఎలాంటి ఒప్పందాలు జరిగాయి.. కాశ్మీర్ విషయంలో చైనా ఏవైనా అడిగిందా. ట్రెండ్ గురించి రెండు దేశాల మధ్య ఏవైనా చర్చలు జరిగాయా అన్నది తెలియాలి. అయితే, జిన్ పింగ్ కాశ్మీర్ విషయాన్నీ ప్రస్తావిస్తే.. మోడీ హంగాంగ్ విషయం గురించి ప్రస్తావించాలని, ఇండియా అంతర్గత విషయంలో ఎవరూ జోక్యం చేసుకున్నా ఊరుకోబోమని కాంగ్రెస్ పార్టీ అంటోంది.  హాంకాంగ్ అల్లర్ల గురించి మోడీ ప్రస్తావించాలనిపట్టుబడుతున్నది


మరింత సమాచారం తెలుసుకోండి: