గల్ఫ్ లో మళ్ళీ ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నట్టుగా కనిపిస్తోంది.  ఇరాన్.. సౌదీ అరేబియా దేశాల మధ్య చమురు యుద్ధం జరుగుతున్నది.  సౌదీ కి చెందిన అరాంకో చమురు శుద్ధి కర్మాగారంపై హుతి ఉగ్రవాదులు డ్రోన్ తో దాడి చేశారు.  ఈ దాడిలో అరాంకో చమురు శుద్ధి కర్మాగారం పాక్షికంగా దెబ్బతిన్నది.  దీనికి కారణం ఇరాన్ అని సౌదీ మండిపడింది. ఇరాన్ తో ఉన్న అన్నిరకాల సంబంధాలు తెంచుకున్నది. 


గతంలో ఇరాన్ కు చెందిన ఆయిల్ టాంకర్ ను రాయల్ ఆర్మీ బందించడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.  ఆ తరువాత దాన్ని వదిలిపెట్టారు.  అంతకు ముందు ఇరాన్ కు చెందిన ట్యాంకర్ ను  పేల్చివేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరాన్.. సౌదిపై కోపంగా ఉన్న సంగతి తెలిసిందే.  అయితే, సౌదీ చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడి తరువాత అమెరికా సౌదీ చుట్టూ అనేక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఏదైనా తేడా వస్తే.. ఇరాన్ పై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పింది.  


ఇప్పుడు తాజాగా ఎర్రసముద్రంలో ప్రయాణం చేస్తున్న ఇరాన్ చమురు ట్యాంకర్ పై రెండు క్షిపణులు దాడి చేశాయి.  ఈ దాడిలో చమురు ట్యాంకర్ లీక్ అయ్యింది.  ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు ఇరాన్ తెలిపింది. ఆయిల్ ట్యాంకర్ కు మరమ్మత్తులు చేస్తున్నారు.  అయితే, సౌదీ అరేబియా తీరంలోని జెద్దా వద్ద ఈ దాడి జరిగింది.  దీనిని ఇరాన్ ఖండించింది.  చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.  


కాగా, ఈ ఘటనపై సౌదీ స్పందించలేదు.  సైలెంట్ గా ఉండటం వెనుక కారణం ఏంటి.. సౌదీ కి చెందిన క్షిపణులు దాడి చేశాయా.. కావాలనే దాడులు చేసారా లేదంటే.. పొరపాటున జరిగిందా అన్నది కూడా చెప్పడం లేదు.  అసలే రెండు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా మారిపోయాయి.  ఈ సమయంలో ఇలా జరిగితే.. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింతగా దెబ్బతినే అవకాశం ఉన్నది.  కాబట్టి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించుకుంటే మంచిది.  


మరింత సమాచారం తెలుసుకోండి: