తెలంగాణ విద్యుత్ శాఖ (TSSPDCL) లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 3,025 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అక్టోబరు 10న విడుదల కానుందన్న విషయం తెలిసిందే. ఈ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా అక్టోబరు 10 నుంచే  ప్రారంభం కానుందని తెలిపారు . కానీ చెప్పిన సమయం దాటిపోయింది. నోటిఫికేషన్ ఇంతవరకు వెలువడలేదు.. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభంకాలేదు. ఈ నోటిఫికేషన్ విషయం పై అధికారులను వివరణ కోరగా దీనిపై స్పందించిన TSSPDCL అధికారులు..


టెక్నికల్ సమస్యల కారణంగా నోటిఫికేషన్‌ను విడుదల చేయలేకపోయామని. సర్వీస్ నిబంధనలకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ నుంచి సమాధానం రాగానే.. మూడు నాలుగు రోజుల్లో ఉద్యోగ ప్రకటన విడుదల చేస్తామని సంస్థ సీఎండీ రఘుమారెడ్డి మీడియాకు తెలిపారు. తెలంగాణ విద్యుత్ శాఖలో ఉన్న ఉద్యోగాలను పరిశీలిస్తే. మొత్తం 3,025 ఖాళీలను భర్తీ చేయనున్నారు.


తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌లో, జూనియర్ లైన్ మెన్ పోస్టులు 2500, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులు 25, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు 500 వరకు ఉన్నాయి. ఇక నిరుద్యగులు ఈ సారైన నోటిఫికేషన్ వాయిదా వేయకుండా ప్రకటిస్తే బాగుండును అని, ఈ పక్రియను ఆలస్యం చేయకుండా వేగవంతంగా జరిపి ఉద్యోగ అవకాశలను కల్పిస్తే తమ సమస్యలకు కొంతవరకైన పరిష్కారం లభిస్తుందని ఆశతో నిరుద్యగులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ విషయం పై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.


 విద్యుత్ శాఖలో  ఖాళీల వివరాలు : 
 జూనియర్ లైన్‌మెన్   : 2,500
జూనియర్ పర్సనల్ ఆఫీసర్ : 25
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ : 500
మొత్తం ఖాళీలు  : 3,025 

మరింత సమాచారం తెలుసుకోండి: