హుజూర్ నగర్ ఎన్నికలు  తేదీ దగ్గరపడుతున్న కొద్దీ వేడి పెరిగింది.  అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి.  తెరాస పార్టీ ఎలాగైనా అక్కడ విజయం సాధించలనే లక్ష్యంతో పోటీ చేస్తున్నది.  కొన్ని రోజుల ముందు వరకు తెరాస పార్టీ విజయం నల్లేరుపై నడకే అనుకున్నారు.  కానీ, ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తున్న తరుణంలో ప్రభుత్వ వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.  ఈ వైఫల్యాల కారణంగా గెలుపు రోజురోజుకు కష్టంగా మారుతున్నది.  


అటు కాంగ్రెస్, బీజేపీలు ఆ ప్రాంతంలో బలంగా ఉండటం విశేషం. గతంలో బీజేపీ నేత విజయం తృటిలో తప్పింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కి అక్కడ మంచి పలుకుబడి ఉండటంతో హుజూర్ నగర్లో విజయం సాధించేందుకు అయన అక్కడే ఉండి ప్రచారం నిర్వహిస్తున్నారు.  బీజేపీ కూడా హుజూర్ నగరంలో విజయం కోసం ప్రయత్నం చేస్తున్నది.  ఇక ఇదిలా ఉంటె మద్దతు ఇస్తామని చెప్పిన సిపిఐ.. ఇపుడు మద్దతు ఇచ్చే సమస్య లేదని తేల్చి చెప్పింది.  


హుజూర్ నగర్లో తెరాస పార్టీ విజయం సాధించాలి అంటే.. తెరాస పార్టీ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించిన అంశాలను తక్షణమే పరిష్కరించాల్సి ఉంటుంది.  దీనిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తేనే.. ఆ పార్టీకి అవకాశం దక్కుతుంది.  లేదంటే ఎంతగా ప్రచారం చేసినా ఆ ప్రచారం మొత్తం వృధా అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  తెరాస ప్రభుత్వం మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని స్పష్టం చేసింది.  


కాగా, ఈరోజు నుంచి సమ్మెను ఉదృతం చేయబోతున్నారు.  ఇప్పటి వరకు ఆర్టీసీడిపోల ముందు మాత్రమే బైఠాయించిన కార్మికులు సమ్మెను మరింత ఉదృతం చేయబోతున్నారు. ఆర్టీసి కార్మికులకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తుండటంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది.  కాంగ్రెస్, బీజేపీ, టిడిపి, సిపిఐ, సిపిఎం లు మద్దతు పలికాయి  అయితే, ఈ విషయంలో ఎంఐఎం స్టాండ్ స్టాండ్ ఏంటి అన్నది ఇప్పటి వరకు స్పష్టం చేయలేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: