ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తీరుపై ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రజాతీర్పును కూడా అపహాస్యం చేసేలా మాట్లాడుతున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. వైసీపీ అధినేత వైఎస్ గేట్లు ఎత్తలేదు కాబట్టే చంద్రబాబు వెనుక కొందరైనా నాయకులు మిగిలి ఉండి.. తిరుగుతున్నారని అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.


ఒకసారి జగన్ గేట్లు ఎత్తితే తెలుగు దేశం పార్టీలో ఒక్క నాయకుడు కూడా చంద్ర బాబు వెనుక ఉండరని అవంతి శ్రీనివాస్ వెటకారం ఆడారు. విపక్షనేత చంద్రబాబు తీవ్ర అసహనంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని అవంతీ శ్రీనివాస్ విమర్శించారు. ఆయన ఉపయోగించే భాష సరిగాలేదన్నారు శ్రీనివాస్. బాధ్యత గల విపక్ష నేతగా ఆయన మాట్లాడటం లేదని ఆరోపించారు.


చంద్రబాబు అధికారంలో ఉండగా అప్పట్లో విపక్ష నేత జగన్ ను విమానాశ్రయం నుంచే బయటకు రానీయకుండా అడ్డుకున్నారని అవంతి శ్రీనివాస్ గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు విపక్ష నేతగా చంద్రబాబు స్వేచ్ఛగా రెండు రోజులు విశాఖలో సమావేశాలు, ధర్నాలు చేసుకో గలిగారన్నారని అవంతి శ్రీనివాస్ గుర్తు చేసారు.


జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలతో చంద్రబాబుకు దిక్కుతోచకుండా ఉందని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. రైతు భరోసా, ఆటో, కార్ డ్రైవర్ లకు ఆర్ధిక సాయం, గ్రామ, వార్డు సచివలయాల ఉద్యోగాలు ఇవ్వటం ఇవన్నీ చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని అవంతి మండిపడ్డారు. ఇదేనా రౌడీ రాజ్యం అంటే అంటూ చంద్రబాబును నిలదీశారు.


చంద్రబాబు తన అసహనాన్ని, అసంతృప్తిని పోలీసుల పైనా, ప్రజల పైనా వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ను కూడా గౌరవించరా అని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో చివరకు ఎవరైనా ప్రజలకే భయపడాలని ఆయన అన్నారు. చంద్రబాబు సంయమనంతో వ్యవహరించి తమ లాంటి జూనియర్ రాజకీయ నాయకులకు ఆదర్శంగా ఉండాలని మంత్రి అవంతి శ్రీనివాస్ కామెంట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: