ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సుపరిపాలన అందిస్తూ  ముందుకు సాగుతున్నారు. పాలనలో తనదైన ముద్ర వేసుకుని... ప్రజలకు ఎన్నో వినూత్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతూ రాష్ట్ర అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు . రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి అయినా  వెనుకాడడం లేదు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రజలు మద్యానికి బానిసై తమ  జీవితాలు నాశనం చేసుకోవచ్చని ఉద్దేశంతో రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేశారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో నూతన మద్యం విధనాన్ని  తీసుకువచ్చి కీలక నిర్ణయం తీసుకున్నారు. 

 

 

 

 

 

 నూతన మద్యం విధానంతో మందుబాబులు అందరికీ భారీ షాక్ తగిలింది. ప్రైవేట్ మద్యం షాపులు అన్నింటినీ రద్దు చేసి ... మొత్తం మద్యం  షాపులన్నీ ప్రభుత్వ పరిధిలోని నిర్వహించేందుకు  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా మద్యం ధరలు  కూడా భారీగా పెంచి మందుబాబులకు షాకిచ్చింది  ప్రభుత్వం. కాగా  ఈ నూతన మద్యం విధానం ద్వారా మద్యం షాపుల్లో నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడంతోపాటు... ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 

 

 

 

 

 

 ఇదిలా ఉండగా భారీగా పెరిగిన మద్యం ధరలతో  మందుబాబులు మందు కొనాలంటేనే  జంకుతున్నారు. నూతన మద్యం  విధానంలో భాగంగా మద్యం షాపులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి  విడతలవారీగా మద్యం షాపులను తగ్గిస్తూ  రాష్ట్రంలో పూర్తిగా సంపూర్ణ మద్యపాన  నిషేధం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ఇప్పటికే మద్యం షాపుల సమయం వేళలు కుదించిన  ప్రభుత్వం... ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒక వ్యక్తికి  లైసెన్స్ లేకుండా గరిష్ఠంగా మూడు బీరు బాటిల్ మాత్రమే అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో లైసెన్స్ లేకుండా ఒక వ్యక్తి దగ్గర ఆరు  బీరు బాటిల్ ఉండేందుకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం... ఇప్పుడు ఆ నిబంధనను మార్చి కొత్త నిర్ణయం తీసుకుంది. కాగా  ఎలాంటి పరిమాణంలో ఉన్న బీరు బాటిల్ అయినా సరే 3 బాటిళ్ళకి  మంచి ఒక వ్యక్తి దగ్గర ఉండకూడదని ప్రభుత్వం హెచ్చరించింది. కాగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయంతో బీరు బాబులకు భారీ షాక్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: