తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపట్టి ఎనిమిది రోజులు అవుతున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు ఆర్టీసీ కార్మికుల  డిమాండ్ లపై  స్పందించలేదు. కాగా ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. ఇప్పటికీ ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ బిజెపిలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వగా... ఉద్యోగ ప్రజా సంఘాల మద్దతు కూడగట్టేందుకు ఆర్టీసీ జేఏసీ ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెకు మరో పార్టీ మద్దతు దొరికింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించిన సిపిఐ పార్టీ... మద్దతుపై పునరాలోచించి  ఉపసంహరించుకుంది. 

 

 

 

 

 

 ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది సిపిఐ పార్టీ. అయితే తెలంగాణ వచ్చాక ఎన్నడు ఏ పార్టీ మద్దతు తీసుకోకుండా ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేసింది టిఆర్ఎస్... కానీ మొదటిసారి హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో సిపిఐ పార్టీ మద్దతు కోరింది టిఆర్ఎస్ పార్టీ. సిపిఐ పార్టీ కి కొంత సంప్రదాయ ఓటు బ్యాంకును ఉండడంతో... హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో సిపిఐ పార్టీని కలుపుకోవాలని భావించింది టిఆర్ఎస్ పార్టీ. ఈ మేరకు సిపిఐ పార్టీ కూడా టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపింది. 

 

 

 

 

 

 కానీ ఇంతలోనే ఆర్టీసీ కార్మికుల సమ్మె తెరమీదకు రావడం... ఆర్టీసీ కార్మికుల సమ్మె పై కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుతో సిపిఐ పార్టీ ప్రకటించిన మద్దతుపై పునరాలోచించింది . ఓవైపు కార్మిక వర్గాల నుంచి కూడా సిపిఐ పార్టీ టిఆర్ఎస్ కు ప్రకటించిన మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ రావడంతో... సిపిఐ ప్రకటించిన మద్దతు ఉపసంహరించుకోక  తప్పలేదు.అంతే కాకుండా  ఆర్టీసీ కార్మికుల సమ్మె పై  కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు... ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కార్మికులు వెనక్కి తగ్గకుండా సమ్మె చేస్తుండడం... ఇలాంటి పరిస్థితుల్లో టిఆర్ఎస్ కు మద్దతు ఇస్తే కార్మికుల్లో సిపిఐ పార్టీ కి వ్యతిరేకత వస్తుందని భావించి మద్దతు ఉపసంహరించుకుంది సిపిఐ పార్టీ. ఆదిలాబాద్ లో ఏడో  రోజు సమ్మెలో  పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆర్టీసీని అప్పులపాలు చేసింది ప్రభుత్వమే  అని... ఇది రాచరికం కాదని ప్రజాస్వామ్యమని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలని విమర్శించారు. ఇప్పటికైనా  ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపాలని... చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని చాడా వెంకటరెడ్డి వెల్లడించారు. ఏదేమైనా సిపిఐ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కి భారీ షాక్ తగిలినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: