టెక్నాలజీ యుగంలో ఎంత సౌకర్యం ఉందో..అంతే ప్రమాదం కూడా మాటేసి ఉంది. సాంకేతిక రంగంలో చోటు చేసున్న విప్లవాత్మకమైన మార్పులతో ఇప్పటికే సైబర్ నేరాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. మరో పక్క అభివృద్ధి చెందిన ఈ సాంకేతికతతో ఎన్నో అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్న పరిస్థితులను కూడా చూస్తున్నాం. ఇదంతా ఎందుకు ఇటీవల కాలంలో ఎలాంటి సమాచారం కావాలన్నా గూగుల్ మాటను ఆశ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ కూడా అంతే నిబద్దతతో సమగ్రహా సమాచారాన్ని సేకరిస్తుంది. దానితో మనం ఎప్పుడు అడిగిన క్షణాల్లో సంబంధిత సమాచారాన్ని అందిస్తుంది. అలాంటి  గూగుల్ శాటిలైట్ మ్యాప్‌ నిరంతర అన్వేషణలో ఉంటుంది.



ఈ క్రమంలో గూగుల్ స్ట్రీట్ వ్యూ కెమేరా తాజా సమాచారాన్ని సేకరించేందుకు  క్లిక్ మనిపిస్తూ నేరుగా మ్యాప్‌లకు అప్‌లోడ్ చేస్తుంది. ఆ ఫోటోలను 360 డిగ్రీ టెక్నాలజీ కెమేరాలతో గూగుల్ స్ట్రీట్ వ్యూను చిత్రీకరిస్తారు. దీందో ఆ కెమేరా చుట్టుపక్కల కనిపించే దృశ్యాలను క్లిక్ చేసి శాటిలైట్ మ్యాప్‌లో పొందుపరుస్తుంది. ఆ మ్యాప్‌లోని వీధులను చూస్తే.. మనమే స్వయంగా ఆ వీధుల్లో ఉన్న భ్రమ కలుగుతుంది. ఏది ఏమైనా.. ఈ కెమెరా కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ముఖ్యంగా ప్రేమికులు సుమీ. గూగుల్ శాటిలైట్ మ్యాప్‌లో తైచుంగ్ నగరంలోని శాంటియన్ రోడ్‌ స్ట్రీట్ వ్యూ చూస్తే.. ఎపి హెరాల్డ్ ఎందుకు చెపుతుందో మీకే తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో  ఏం చేసినా ఇబ్బందే అన్న విషయాన్ని గ్రహించాలి మరి. దుస్తులు విప్పేసి నగ్నంగా ఒకరినొకరు బిగి కౌగిళ్లలో బంధించుకుని లోకాన్ని మరిచి పోయిన ఓ జంట అడ్డంగా బుక్కయ్యింది. తైవాన్‌లోని




ఓ జంట ఎవరూలేని ప్రాంతంలోకి వెళ్లి రొమాన్స్‌లో మునిగితేలారు. ఇంకేముంది ఈ ప్రేమ జంట ప్రేమాయణం కాస్త  గూగుల్ స్ట్రీట్ వ్యూ కెమేరాకి చిక్కింది.  వారి ఏకాంత క్షణాలను గూగుల్ స్ట్రీట్ వ్యూ కెమేరా క్లిక్ చేసి నేరుగా మ్యాప్‌లకు అప్‌లోడ్ చేసింది. ఎవరైనా ఇప్పుడు ఆప్రాంతంలో స్ట్రీట్ వ్యూ చూస్తే.. ఈ నగ్న జంట చిత్రమే కనిపిస్తోంది. ఇప్పటికే వేలాది మంది ఈ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో చూసేశారు. మరి కొందరు ఆకతాయిలు దీన్ని ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అది వైరల్‌గా మారింది. ఇప్పటికి  నుంచి చాలామంది గూగుల్ మ్యాప్‌లోకి వెళ్లి శాంటియన్ రోడ్‌లో ఆ జంట ఫొటోను చూసేందుకు తెగ వెతికేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: