మోడీని నానా మాటలు తిట్టింది తెలుగుదేశం పార్టీ మాత్రమే. దేశంలో వామ‌పక్షాలు, మమతాబెనర్జీ లాంటి వారు కూడా మోడీని తీవ్రంగా వ్యతిరేకించారు.  కానీ ఎవరూ తిట్టనంతగా మోడీని తిట్టిన ఘనత మాత్రం టీడీపీదే. చంద్రబాబుతో మొదలుపెడితే పార్టీలో కార్పోరేటర్ స్థాయి నాయకుడు వరకూ మోడీని దారుణంగా అవమానించారు. ఇది  మోడీని, బీజేపీకి తక్కువ చేసి నాడు టీడీపీ ఆడిన రాజకీయ జూదం. చేదు ఫలితం కూడా వచ్చింది.


ఇపుడు ఘోరంగా ఓడిపోయి మాజీ అయ్యాక చంద్రబాబు నాటి పరిణామాలపైన చింతిస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. మోడీని, బీజేపీని నిందించి ఉండరాదు అన్న భావన కూడా వ్యక్తం అవుతోందిట. అదే సమయంలో కేంద్రంతో  అనవసరంగా గొడవ పెట్టుకున్నామని బాబు అంటున్నారు. అది కూడా ఏపీ ప్రజల ప్రయోజనాల కోసమే చేశామని కూడా తప్పు జనం మీదకు తోస్తున్నారు. ఇక్కడ ప్రజలు అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి లబ్ది పొంది కూడా ఓడించేశారు.


అదే సమయంలో కేంద్రంతో గొడవల వల్ల పార్టీ రాజకీయంగా నష్టపోయిందని బాబు మార్క్ విశ్లేషణ చేస్తున్నారట. మొత్తానికి చూసుకుంటే బీజేపీకి దూరం అయి ఓడిపోయామన్న మాట బాబు నోటి వెంట చెప్పకుండానే వస్తోంది. దీంతో మళ్ళీ బీజేపీతో రాయబేరాలకు టీడీపీ రెడీ అవుతుందా అన్న సందేహాలు వస్తున్నాయి. దీని మీఅ అనేక ఉదాహరణలు కూడా కళ్లముందు ఉన్నాయి. తనకు అత్యంత సన్నిహితులైన ఎంపీలను బీజేపీలోకి బాబు దగ్గరుండి పంపించారని కూడా ప్రచారం ఓ వైపు సాగుతుండగా బాబు గారు పార్టీ మేధో మధనంలో కూడా బీజేపీ పట్ల ప్రేమను కురిపించడం బట్టి చూస్తూంటే ఏపీలో మళ్ళీ కమలంతో కరచాలనం చేయడానికే బాబు ఉబలాటపడుతున్నార‌నిపిస్తోందంటున్నారు.


అయితే మోడీకి బాబు ఎన్ని ప్రేమ సంకేతాలైనా పంపించవచ్చు, ఎన్ని ప్రేమలేఖలు అయినా రాయవచ్చు కానీ మోడీ, అమిత్ షా ఉన్న బీజేపీలో బాబుకు చోటు ఉంటుందా, పొత్తులు పెట్టుకుంటారా, పాతవాటిని మరచిపోయి ఆదరిస్తారా అన్నది పెద్ద డౌటేనని అంటున్నారు. ఎందుకంటే మోడీ షాల వ్యవహారం ఎలా ఉంటుందంటే వారు పాతవి ఎపుడూ మరచిపోరు. అందుకు కళ్ళ ముందు ఉదాహరణ చిందంబరం ఇపుడు జైలు వూచలు లెక్కబెట్టడమే. కానీ రాజకీయాల్లో ఏదీ అసాధ్యం అని కూడా చెప్పలేం. చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: