ఎన్నికల ప్రచారం సమయంలో ఎన్నో హామీలు ఇస్తుంటారు.  ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తెగ ప్రయత్నం చేస్తుంటారు.  ఇచ్చింది హామీలే.. వాటిని అమలు చేసినపుడు చూద్దాంలే అని పక్కన పెడుతుంటారు.  గత కొంతకాలంగా వివిధ రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలను చూస్తుంటే.. మనిషిని ఎంత బద్దకస్తుడిగా మారుస్తున్నారో అర్ధం అవుతున్నది.  నిరుద్యోగ భృతి, బియ్యం,పప్పు, ఉప్పు అన్ని సబ్సిడీ, గ్యాస్ సబ్సిడీ, వీటితో పాటు విద్య, ఉద్యోగం కోసం రిజర్వేషన్.. వాళ్లకు ఏమొచ్చినా రాకున్నా రిజర్వేషన్ ఉంటె చాలు ఉద్యోగం వచ్చేస్తుంది.  


ఉద్యోగం వచ్చిన తరువాత వాళ్ళు ఏం చేస్తారు.. టీచర్లయితే ఏం చెప్తారు అన్నది పట్టించుకోరు. వచ్చినా రాకున్నా రిజర్వేషన్ ఉంటె చాలు ఉద్యోగం గ్యారెంటీ.  ఇవీ చాలదన్నట్టు ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీలు ఫ్రీ పధకాలు మొదలుపెట్టాయి.  బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఫ్రీ అని కాంగ్రెస్ పార్టీ హర్యానా మేనిఫెస్టోలో ప్రకటించింది.  బస్సుల్లో ఎక్కడికైనా ప్రయాణం చెయ్యొచ్చు.  మహిళలైతే చాలు.. ఫ్రీగా ప్రయాణం.  


ఫ్రీగా ప్రయాణం కావాలని ఎవరు అడగరు.  ఎందుకంటే, ఒకవేళ ఫ్రీగా ప్రయాణం చేస్తే.. రేపు ఆ చార్జీలను పన్నుల రూపంలో ప్రజల నుంచే ముక్కుపిండి వసూలు చేస్తుంటారు.  ఇప్పటి ప్రజలు రాజకీయ నాయకులు అనుకున్నంతగా అమాయకులు కాదు.  దేశ ఆర్ధిక వ్యవస్థ గురించి అవగాహనా చేసుకున్నారు.  ఫ్రీగా ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా లేరు.  మొన్నటికి మొన్న ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా ఇలానే ఫ్రీ అంటూ ప్రకటించింది.  


అసలే ప్రభుత్వరంగ సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి.  ఇలా ఫ్రీ అని ప్రకటిస్తే దానివలన వచ్చే నష్టాలు, కష్టాలు ఏంటో తెలిసిన కేజ్రీవాల్ లాంటి వ్యక్తులు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదు.  ప్రజలు కోరుకునే, ప్రజలకు మంచి అనిపించే పధకాలు రూపొందిస్తే అందరికి సమ్మతంగా ఉంటుంది.  అంతేగాని, ఫ్రీ పధకాలు ప్రవేశపెట్టి అప్పణంగా ఓట్లు దండుకోవాలని చూస్తే ప్రజలు అలాంటి నాయకులకు తప్పకుండా ఓటుతో బుద్ధిచెప్తారు అనడంలో సందేహం అవసరం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: