ఈరోజు మహాబలిపురంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ ప్రధాని మోదీ మధ్య శిఖరాగ్ర సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో మోదీ, జిన్ పింగ్ తో పాటు ఇరు దేశాలకు చెందిన 16 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు జిన్ పింగ్ చైనాకు తిరుగు ప్రయాణం కానున్నారు. శిఖరాగ్ర సమావేశంలో వాణిజ్య సంబంధాలు, పరస్పర సహకారం గురించి చర్చలు ఉండబోతున్నాయని సమాచారం. 
 
నిన్న మహాబలిపురంలో జరిగిన ఇష్టాగోష్టిలో మోదీ, జిన్ పింగ్ ఈ అంశాలపైనే చర్చించినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదం, తీవ్రవాదం అంశాల గురించి కూడా ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈరోజు మూడు గంటల పాటు మోదీ, జిన్ పింగ్ మధ్య భేటీ జరగబోతుందని తెలుస్తోంది. తాజ్ ఫిషర్ మెన్ హోటల్ లో అల్పాహారం తరువాత చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రధానంగా కశ్మీర్ అంశంపై చర్చ ఉండబోతుందని చర్చ అనంతరం మోదీ జిన్ పింగ్ ఒక ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
భారత దేశంలో నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్రధాని మోదీ మహాబలిపురంలోని బీచ్ లో ప్లాస్టిక్ వ్యర్థాలను, వ్యర్థ పదార్థాలను ఏరి ఒక కవర్ లో తీసుకెళ్లారు. ఆ తరువాత అక్కడ ఉన్నవారికి ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ లక్ష్యం గురించి వివరించారు. 
 
సామాన్యులకు ప్రధాని ఒక రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. ఒక మనిషి గొప్పగా ఎలా ఎదిగాడు..అన్న దానికి మోదీ లాంటి మహోన్నతమైన వ్యక్తిని చూసి నేర్చుకోవొచ్చు..వేల మంది తిరిగే బీచ్ లో ఎవరికీ పట్టనట్టు ఉండే ఈ కాలంలో నిర్మోహమాటంగా తాను చెత్త వేరుకుంటూ కనిపించడం చూస్తుంటే..మనలో కాస్తైనా మార్పు తప్పక రావాల్సి ఉంది. ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ లక్ష్యం కొరకు మన వంతు సహకారం మనం అందించాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: