జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి, మెల్ల మెల్లగా అడుగులు వేస్తూ, టీడీపీ పెట్టిన బొక్కల లెక్కలు తెల్చుతూ ఎంతో వ్యూహాత్మకంగా ప్రతీ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటు ముందుకు వెళ్లుతుంది. ఈ దశలో జగన్ పై టీడీపీ పార్టీ విష ప్రచారానికి తెర తీస్తోందని అంటున్నారు. టీడీపీలో ఓ నేత ఆధ్వర్యంలో జగన్ పై భారీ స్థాయిలో ప్రజలకి అసంతృప్తి కలిగేలా ప్రచారం నిర్వహిస్తుందని, ఈ దుష్ప్రచారానికి ఆయుధంగా మౌత్ పబ్లిసిటీని వాడుకుంటుందని కొందరు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.


ఇక ఇలాంటి, ప్రచారాలు ఎన్నో వ్యవస్థలని నాశనం చేసిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇప్పుడు దీన్నే నమ్ముకున్న దట టీడీపీ పార్టీ. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎక్కువగా గ్రామస్థాయిలోనే ఉంటాయి. కాబట్టి జగన్ ప్రభుత్వ పధకాలపై , జగన్ తీసుకుంటున నిర్ణయాలపై అక్కడి నుంచీ యాంటీ ప్రచారం మొదలు పెడితే మెల్లమెల్లగా జగన్ పై వ్యతిరేకత తీసుకురావచ్చు అనే ఆలోచనలో పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారట టీడీపీ నేతలు. అయితే ఈ వ్యూహాలు మొత్తం టీడీపీలోని ఓ కీలక నేత ఆధ్వర్యంలో జరుగుతున్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇకపోతే ఎలాగైన జగన్‌ను దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో కరెంట్ పై టీడీపీ దుష్ప్రచారం మొదలు పెట్టింది. కాని ఇప్పుడున్న ధరలను చంద్రబాబు హయాములోని ధరలను పరిశీలిస్తే నిజనిజాలు బయట పడుతాయి..


పోయిన సం Oct 1, 2018 న బాబు CM గా ఉన్నప్పుడు AP ప్రభుత్వము ఎక్చేంజ్ నుంచి కిలో వాట్ రూ 5 .99 కి కొంటె ఈ సం Oct 1, 2019 న జగన్ గారి ప్రభుత్వం 3. 33 కు కొన్నది.
పోయిన సం Oct 2, 2018 న బాబు CM గా ఉన్నప్పుడు AP ప్రభుత్వము ఎక్చేంజ్ నుంచి కిలో వాట్ రూ 5 .72 కి కొంటె ఈ సం Oct 2, 2019 న జగన్ గారి ప్రభుత్వం 2 .95 కు కొన్నది
పోయిన సం Oct 3, 2018 న బాబు CM గా ఉన్నప్పుడు AP ప్రభుత్వము ఎక్చేంజ్ నుంచి కిలో వాట్ రూ 6 .58 కి కొంటె ఈ సం Oct 3, 2019 న జగన్ గారి ప్రభుత్వం 3.41 కు కొన్నది
పోయిన సం Oct 4, 2018 న బాబు CM గా ఉన్నప్పుడు AP ప్రభుత్వము ఎక్చేంజ్ నుంచి కిలో వాట్ రూ 6 .56 కి కొంటె ఈ సం Oct 2, 2019 న జగన్ గారి ప్రభుత్వం 3 .38 కు కొన్నది..


ఇక బాబు హయాములో కరెంటు యూనిట్ రూ 4 .50 కి కొంటె జగన్ ఇప్పుడు 11 .68 కి కొంటున్నాడు అని వారుచేసే దుష్ప్రచారం ప్రచారంలోని వాస్తవాలెంతున్నాయో మనకు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి. ఇలాంటి చౌకబారు చర్యలు ఇకనైన మానుకుంటే ఆ పార్టీకి, అందులోని నాయకులకు ప్రజల్లో కాస్తైన సానుభూతి మిగులుతుంది. లేదంటే ఉన్న సానుభూతి పోయి చివరకు ఏకాకిలా మిగలవలసి వస్తుందని  వైసీపీ వర్గాలు అనుకుంటున్నాయి. ఇక ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రచారాలపై వైసీపీ కీలక నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: