మొన్నటివరకు చైనా పర్యటనకు వెళ్లిన మోడీ... చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో సమావేశమై భారత్ చైనా కు మధ్య సత్సంబంధాలను మెరుగుపరిచిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం దేశ ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్  మహాబలిపురంలో పర్యటించడం దేశ ప్రజల చూపును ఆకర్షిస్తోంది. ఇండియా పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కి  దేశ ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. అయితే  ఎప్పుడు కుర్తా పైజామా... ఆప్ స్లీవ్  జాకెట్ లో కనిపించే ప్రధాని మోదీ మొదటిసారి పంచ కట్టులో కనిపించి చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ కి  ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మహాబలిపురం ఆలయంలో పర్యటించారు. 

 

 

 

 

అయితే  మహాబలిపురంలో దేశ ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. చైనా అధ్యక్షులు జింగ్ పింగ్  కి ప్రధానమంత్రి మోడీ  భారతీయ సంస్కృతిని పరిచయం చేసారు. మహాబలిపురం లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూసి చైనా అధ్యక్షుడు సంతోషం వ్యక్తం చేశారు. భారతీయ సంస్కృతి నే కాకుండా భారతీయ వంటకాలను కూడా చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ కి రుచి  చూపించారు ప్రధాని నరేంద్ర మోదీ. కాగా మోడీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మధ్య ఉన్న స్నేహ గీతిక అందరిని ఆకర్షించింది. కాగా నేడు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రధాని మోదీ శిఖరాగ్ర సమావేశం నిర్వహించినున్నారు . 

 

 

 

 

 

 అయితే  ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్  సహా ఇరుదేశాల ప్రతినిధులు పాల్గొన్ననున్నారు . కాగా  చైనా భారత్ ల  మధ్య సత్సంబంధాలు పై  ఈ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా ఉగ్రవాద నిర్మూలన అంశంపై కూడా ప్రధానంగా ఈ భేటీలో  చర్చించనున్నారు. కాగా నేడు సమావేశంలో ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడు ఓ బహుమతి కూడా  అందించనున్నారు . చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దేశ ప్రధాని మోడీ కి మధ్య మంచి స్నేహ పూర్వక బంధం ఏర్పడడంతో... చైనా కి భారత్ కి మధ్య ఉన్న సంబంధాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: