చంద్రబాబునాయుడు రూటు మార్చారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. గడచిన నాలుగు నెలలుగా జగన్మోహన్ రెడ్డిపై తాను ఎన్నిరకాలుగా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నా జనాలు ఏమాత్రం పట్టించుకోవటం లేదని చంద్రబాబుకు అర్ధమైపోయింది. అందుకనే రూటు మార్చినట్లు అర్ధమైపోతోంది.

 

విశాఖపట్నం జిల్లాలో తన వ్యూహాన్ని అమలు చేయటం స్పష్టంగా కనిపించింది. ఆరోపణలు, విమర్శల స్ధానంలో సింపథి గెయిన్ చేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  అందుకనే  రెండు రోజుల విశాఖపట్నం జిల్లాలో పోలీసులతో గొడవపెట్టుకున్నారు.  చంద్రబాబు నగరానికి వస్తున్న సందర్భంగా జిల్లా నేతలు భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు.

 

అనుమతి లేదని తెలిసి కూడా పోలీసు ఆంక్షలను ఉల్లంఘించి నగరంలో ర్యాలి నిర్వహించారు టిడిపి నేతలు. దాంతో టిడిపి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ముందుగా అనుకున్నట్లుగానే పోలీసులపై చంద్రబాబు రెచ్చిపోయారు. ర్యాలీలు నిర్వహించటమన్నది ప్రజాస్వామ్యంలో తమ హక్కంటూ పోలీసులను నోటికొచ్చినట్లు మండిపోయారు.

 

ఇదే చంద్రబాబు తాను సిఎంగా ఉన్న సమయంలో వైసిపి నేతలు బహిరంగసభకు అనుమతులడిగితే ఇవ్వలేదు. ఆందోళన కార్యక్రమాలను అడ్డుకున్నారు. జగన్మోహన్ రెడ్డి దీక్షలకు ముందుగా అనుమతిలిచ్చి కూడా తర్వాత రద్దు చేశారు. అప్పడు ప్రజాస్వామ్యం, హక్కులు ఏవీ గుర్తుకు రాలేదు.  

 

తాను అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండకూడదంటారు. అదే ప్రతిపక్షంలో ఉన్నపుడు మాత్రం ప్రభుత్వం ప్రతిపక్షాలను పట్టించుకోవటం లేదంటూ మండిపోతారు. చంద్రబాబు వైఖరే చిత్ర విచిత్రంగా ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు.

 

ఇపుడు కూడా చంద్రబాబు ఇలాగే వ్యవహరిస్తున్నారు. జనాల సింపథి పొందటం ఎలాగన్న విషయంలో వ్యూహాలు పన్నుతున్నారు. తనను పోలీసులు నిర్భందిస్తున్నారని, తనపై ఆంక్షలు విధిస్తున్నారని, తనపై నిఘా పెట్టారంటూ కొత్త నాటకాలు మొదలుపెట్టారు.  చంద్రబాబు చేసిన ఆరోపణలను, విమర్శలను పట్టించుకోని జనాలు కొత్తగా మొదలుపెట్టిన సింపథి డ్రామాలను మాత్రం పట్టించుకుంటారా ? అన్నదే అసలైన ప్రశ్న.


మరింత సమాచారం తెలుసుకోండి: