తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జగ్గా రెడ్డి స్థానం ఎప్పుడు ప్రత్యేకమే తను చేసే మంచి పనులు,సేవా కార్యక్రమాలు, ప్రజల పై ఉన్న ప్రేమే ఈ స్థాయికి తీసుకొచ్చింది.అయితే జగ్గారెడ్డి హర్ట్ అయ్యారు అంట ఆయన ఈ విధంగా తన ఆవేదనను వెళ్లబుచ్చారు.

"నా వద్ద డబ్బులున్నాయని మీరంతా అనుకుంటున్నారు.వాస్తవానికి నా దగ్గర డబ్బులు లేవు మీ లాంటి కార్యకర్తలు, నాయకులే నాకు అప్పులిస్తున్నారు. దీంతోనే రాజకీయాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. డబ్బులు లేనప్పటికీ మీకు వైద్యానికి, పెళ్లిళ్లకు సాయం చేస్తూనే ఉంటా. నాకు 100 కోట్ల అప్పులుంటాయి" అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలంలోని మల్కాపూర్‌ చౌరస్తాలోని ఓ ఫంక్షన్‌ హాలులో శుక్రవారం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తనకు కావాల్సినప్పుడు అభిమానులు,పార్టీ కార్యకర్తలే అప్పుగా ఇస్తుంటారన్నారు. తాను ఎవరెవరి వద్ద ఎంత డబ్బు తీసుకున్నాననే దానికి నిదర్శనంగా అక్కడే ఉన్న కొంతమంది నేతలను పిలిచి నీ వద్ద ఎంత తీసుకున్నాను అంటూ అడగటం కొసమెరుపు. ఇటీవల జరిగిన దసరా పండుగకు సుమారుగా రూ.కోటి ఖర్చు చేశానని తెలిపారు.ఇలాంటి మంచి మనసున్న నాయకుడుని కాపాడుకోవడం అందరి బాధ్యత అంటూ అక్కడి కార్యకర్తలు, అనుచరులు,అభిమానులు వారి మాటలకు,వారి భరిసాకు జై జై ధ్వానాలతో అభినందించ సాగారు.తన నియోజక వర్గ స్థాయిలో ఏ ఇబ్బంది ఉన్నా ప్రభుత్వం తో సంబంధం లేకుండా అభివృద్ధి చేసి చూపడం జగ్గా రెడ్డి స్పెషల్.

మొత్తానికి అప్పుచేసైన జనాన్ని కాపాడే దేవుడు జగ్గా రెడ్డి అంటూ చరిత్రలో ఒక పేజీ ఆయనకంటూ ఉన్నందుకు అందరం సంతోషిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: