జగన్మోహన్ రెడ్డిని  కంట్రోల్ చేయలేక  చంద్రబాబునాయుడు నానా అవస్తలు పడుతున్నారు. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో అయితే జగన్ ధాటిని తట్టుకోలేక చంద్రబాబు చేతులెత్తేసిన విషయం అందరూ చూసిందే. నిజానికి ప్రతిపక్షంలో ఉన్నపుడే జగన్ ను తట్టుకోలేక  చంద్రబాబు చాలాసార్లు ఇబ్బందులు పడిన విషయాన్ని అందరూ చూశారు.

 

తరచూ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ  అని చెప్పుకునే చంద్రబాబు నాలుగు పదుల వయస్సున్న జగన్ ను ఎందుకు తట్టుకోలేకపోతున్నారు ? ఎందుకంటే ఏ విషయంలో కూడా జగన్ కున్న క్లారిటి చంద్రబాబుకు లేకపోవటమే. అయితే అంతకన్నా ముఖ్యమైన విషయం జగన్ కు ప్రత్యేకంగా అధిష్టానం అంటూ లేదు.  జగన్ కు తానకు తానే హై కమాండ్.

 

అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ను కూడా కొన్నిసార్లు చంద్రబాబు నియంత్రించగలిగారు. ఎలా సాధ్యమైందంటే అప్పట్లో కాంగ్రెస్ హై కమాండ్ ఢిల్లీలో ఉండేది. కాబట్టి కాంగ్రెస్ అధిష్టానంలోనొ కొందరితో తనకున్న సాన్నిహిత్యంతో తనపైకి వైఎస్సార్ దూకుడుగా రాకుండా చంద్రబాబు వాళ్ళని అడ్డుపెట్టుకునే వారన్న విషయం అందరికీ తెలిసిందే.

 

వాస్తవాలు ఇలాగుంటే చంద్రబాబు మాత్రం అప్పట్లో తనంటే వైఎస్సార్ భయపడేవారని ఇపుడు చెప్పుకుంటున్నారు. తాను అసెంబ్లీ మాట్లాడితే వైఎస్సార్ నోరెత్తలేకపోయేవారట. ఆ భయంతోనే వైఎస్సార్ సిఎం అయిన తర్వాత కూడా తన పథకాలను కంటిన్యు చేసినట్లుగా చెప్పుకుని చంద్రబాబు తృప్తి పడుతున్నారు.

 

మరి తండ్రినే కంట్రోల్ చేయగలిగిన చంద్రబాబు కొడుకు జగన్ ముందు మాత్రం ఎందుకని చతికిలపడిపోతున్నారు ? ఎందుకంటే వైఎస్సార్ గురించి చంద్రబాబు చెప్పిందంతా అబద్ధమే కాబట్టి.  అప్పట్లో  వైఎస్సార్ ముందైనా ఇపుడు జగన్ ముందైనా చంద్రబాబు చేతులెత్తేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. అప్పట్లో వైఎస్సార్ కు పైన అధిష్టానం ఉండేది కాబట్టి చంద్రబాబు కొన్నిసార్లు బతికిపోయాడు. అయితే ఇపుడు జగన్ తానకు తానే అధిష్టానం కాబట్టి సందు దొరికినపుడల్లా చంద్రబాబును వాయించేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: