ప్ర‌తిష్టాత్మ‌కంగా సాగుతున్న రెండు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న బీజేపీ గురించి ఆస‌క్తిక‌ర‌మైన స‌మాచారం తెర‌మీద‌కు వ‌చ్చింది. హర్యానాలో ఈనెల 21న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పట్టు సాధించి అధికార పగ్గాలు చేపట్టడానికి భారతీయ జనతా పార్టీ సర్వశక్తూలు ఒడ్డుతోంది. 90 అసెంబ్లీ స్థానాల్లో 75 కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. గెలుపే లక్ష్యంగా స్టార్ క్యాంపెయినర్లు అందరినీ ప్రచార బరిలోకి దింపి ఎలాగైనా మళ్లీ అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది.  అయితే, గ‌త ఎన్నిక‌ల్లో కోట్లు కుమ్మ‌రించిన‌ట్లు వార్త‌లు వెలుగులోకి వ‌చ్చాయి. 014 మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసింది. ధన ప్రవాహంతో ఓటర్లను ప్రభావితం చేయడానికి ఒక బీజేపీనే దాదాపు రూ. 266.82 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ప్రచారంకోసమే రూ.186.39 కోట్లను వెచ్చించినట్టు వెల్లడించింది.


2014లో జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు సేకరించిన నిధులు, ఖర్చుల వివరాలను తెలుపుతూ అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌)  తన నివేదికను విడుదల చేసింది. గత ఎన్నికల్లో మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రచారం కోసం అత్యధికంగా ఖర్చు చేసినట్టు తెలిపింది. ఈ క్రమంలోనే రూ.296.74 కోట్ల నిధులను సేకరించింది. ఆ తరువాత స్థానంలో కాంగ్రెస్‌ రూ .84.37 కోట్లు, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) రూ. 38.1 కోట్లు, శివసేన రూ. 16.36 కోట్లు, సమాజ్‌ వాదీ పార్టీ రూ .7.45 కోట్లు, సీపీఐ(ఎం), సీపీఐలు రూ .3.69 కోట్లు విరాళాలను సేకరించినట్టు వెల్లడించింది. కానీ ఎన్నికల ఖర్చుల వివరాల్లో మాత్రం బీజేపీ ఆ మొత్తాన్ని రూ.226.82 కోట్లుగా నమోదు చేసినట్టు తెలిపింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే అత్యధికంగా 43శాతం మందిపై క్రిమినల్‌ కేసులున్నట్టు ప్రకటించింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెెలుపొందిన 542 ఎంపీల్లో 88శాతం మంది కోటీశ్వర్లేనని తెలిపింది. 


మాజీ ఎన్నికల కమిషనర్ ఖురేషి ఈ నివేదిక గురించి మాట్లాడుతూ... రెండు దశాబ్దాలుగా మనదేశ ఎన్నికలు.. డబ్బు, అధికారం చేతిలో ఉన్నవారికి 'క్రీడ మైదానాలు'గా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్‌, న్యాయవ్యవస్థ పూర్తి స్థాయి అధికారాలిస్తే ఆ ధోరణిని మార్చవచ్చునని సూచించారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో సోషల్‌ మీడియా ప్రభావం అధికంగా ఉందని విశ్లేష‌కులు అంటున్నారు. రాజకీయ పార్టీలు కోడ్‌ను ఉల్లంఘించిన ఈసీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ వార్తలను ప్రచారం చేయడంలో డిజిటల్‌ ప్రచారం, డేటా అనలిటిక్స్‌ వాడకం, మైక్రో-టార్గెటింగ్‌ వంటి పనులను చేస్తున్నట్టు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: