అగ్రరాజ్యం మరోసారి హెచ్‌1బీ వీసా జారీ ప్రకియను కఠినం చేసింది. హెచ్‌1బీ  విషయంలో యూఎస్‌ ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. వీసా అప్లై చేసుకునే కాల పరిమతిని తగ్గించింది అగ్రరాజ్యం. ఈ నిర్ణయంతో చాలా మంది విదేశీయులు మరింత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది.


అగ్రరాజ్యంలో ఉద్యోగానికి అవసరమైన హెచ్‌1బీ వీసా విషయంలో మరోసారి కీలక మార్పులు చేసింది . ఉద్యోగంలో చేరే తేదీకి కనీసం 90 రోజుల ముందే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు ఓ ట్వీట్‌ చేసింది యూఎస్‌ ఎంబసీ. అమెరికాలో వర్క్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఉద్యోగంలో చేరే తేదీకి కనీసం 90 రోజుల ముందు ఐ797 ఫారమ్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చుఅని వెల్లడించింది.   


హెచ్‌1బీ వీసా ద్వారా ఎక్కువ మంది భారతీయులు ప్రయోజనం పొందుతున్నారు. ఈ వీసా జారీ ప్రక్రియలో అమెరికా ఎన్నో అంక్షలు విధిస్తోంది. ఈ వీసా ద్వారా అమెరికాలో పనిచేసే విదేశీయుల సంఖ్య పెరిగిపోతుందని, ఫలితంగా అమెరిన్లకు నష్టం వాటిల్లుతోందని చెబుతూ వీసా నిబంధనలను  కఠినతరం చేస్తున్నారు. అమెరికాలో దాదాపు ఆరున్నర లక్షల మంది విదేశీయులు హెచ్‌1బీ వీసాలపై ఉద్యోగం చేస్తున్నారు. వీరిలో భారత్‌, చైనాలకు చెందిన వారే అధికంగా ఉన్నారు.


విదేశీ విద్యార్థుల్లో భారతీయులకు అమెరికాలో విద్యాభ్యాసానికి మాత్రమే అనుమతినిస్తామని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అమెరికాలో పనిచేసే విదేశీ వలస ఉద్యోగుల్లో భారతీయ ఐటీ నిపుణుల వాటా 60 శాతం. ఈ రూల్స్‌తో హెచ్ 1 బీ వీసా కింద అమెరికాకు వేల మంది ఉద్యోగులను పంపాలంటే ఇండియన్ ఐటీ కంపెనీలు ఆలోచించుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. మొత్తానికి హెచ్ 1బీ వీసా కఠినతరం చేసి భారతీయుల్లో కొంత నిరుత్సాహాన్ని నింపింది అమెరికా.

మరింత సమాచారం తెలుసుకోండి: