తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 8వ  రోజుకు చేరుకుంది. అయితే ఇప్పుడు వరకు ఆర్టీసీ కార్మిక డిమాండ్లపై ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదు. ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించడం కంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఎక్కువ మొగ్గు చూపుతుంది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన ఆర్టీసీ కార్మికులు... ప్రభుత్వం తమ డిమాండ్లపై పరిష్కారం చూపించే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. కాగా రోజు రోజుకి  సమ్మె ఉధృతం అవుతుంది. వివిధ పార్టీల మద్దతు కూడగట్టుకొని... సమ్మెను బలోపేతం చేస్తుంది టీఎస్ ఆర్టీసీ జేఏసీ. 

 

 

 

 

 ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపట్టడంతో ప్రభుత్వం ప్రైవేటు వాహనాలు నడిపిస్తుంది. కానీ ప్రయాణికుల అవసరాలను మాత్రం పూర్తిస్థాయిలో తీర్చడం లేదు ప్రభుత్వం తిప్పుతున్న బస్సులు. అంతేకాకుండా ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తుండడంతో ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం గా మారుతోంది. అయితే ఇప్పటికే ఆర్టీసీ సమ్మెకు బిజెపి-కాంగ్రెస్ లు మద్దతు తెలిపారు.ఇక  తాజాగా సిపిఐ పార్టీ కూడా మద్దతు ప్రకటించడంతో ఆర్టీసీ సమ్మెకు మరింత బలం చేకూరింది. 

 

 

 

 

 అయితే ఇప్పటివరకు ప్రభుత్వం ఆర్టీసీ సమ్మె పై  కనీసం స్పందించడం లేదు. అయితే తాజాగా  రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆర్టీసీ కార్మికుల సమ్మె పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం...తమ విధానం కాదని మేము ఎప్పుడూ తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇవ్వలేదని రవాణా శాఖ మంత్రి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం హామీ  ఇవ్వకపోయినా  తాము ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపామని కానీ ఆర్టీసీ కార్మికులు మాత్రం ఏకపక్షంగా చర్చల నుండి వెళ్లిపోయారని షాకింగ్ కామెంట్ చేశారు. ఆర్టీసీ సమ్మె అసంబద్ధమైన అని తెలిపారు. ఇక దసరా పండుగ నేపథ్యంలో  కార్మికులందరూ సమ్మెకు దిగడంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం విజయం సాధించిందని  రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్  స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: