రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె ఎనిమిదొవ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మో ఆపమని, మాకు న్యాయం చెయ్యాలని ఇంకా ఉదృతం చేస్తామని వారు అంటున్నారు. అయితే ఈ సమ్మెపై ఈరోజు మీడియాతో మాట్లాడిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదని వారు స్పష్టం చేశారు. 

               

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో నేడు మీడియాతో మాట్లాడిన పువ్వాడ అజయ్ కుమార్.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్ఎస్ ఎన్నడూ హామీ ఇవ్వలేదని అన్నారు. కార్మికుల సమ్మె దృష్ట్యా ప్రయాణికుల కోసం చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో సక్సెస్ అయ్యామని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట విరుద్దమన్న, ప్రజలను ఇబ్బంది పెట్టడాన్ని ప్రతిపక్షాలు సమర్ధిస్తాయా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 

                  

అయితే సమ్మె పేరుతో ప్రతిపక్ష నాయకులూ రాజీయం చేయడం తగదని, కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా అని ప్రశ్నించారు..?  సమ్మెను ప్రయాణికుల మీద బలవంతంగా రుద్దుతున్నారని పువ్వాడ అజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని, ప్రైవేటీకరణ చేస్తామని ఎప్పుడూ చెప్పలేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.

              

చర్చల నుంచి కార్మిక నేతలే ఏకపక్షంగా వెళ్లిపోయారని పువ్వాడ వ్యాఖ్యానించారు. ఆర్టిసికి 4400 కోట్ల మేరే ఆస్తులు ఉన్నాయని విభజన లెక్కలు చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మెని రాజకీయంగా వాడుకుంటున్నారని పువ్వాడ పేర్కొన్నారు. 

              

మరింత సమాచారం తెలుసుకోండి: