దేశంలో అత్యంత సీనియర్ నేతగా తనకు తాను ప్రకటించుకున్నతెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మెల్లమెల్లగా వాస్తవాల్లోకి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. చేసిన పాపాలు మెడకు చుట్టుకోవడమంటే..చంద్రబాబు రాజకీయ దుస్థితిని చెప్పుకోకతప్పదు. నిన్న మొన్నటి వరకేంటి ఇప్పటికీ తనకు నచ్చని వారిపై ప్రసారమాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిన విషయమే. ఏదైతే మీడియాను ఉపయోగించుకున్నారో ఆ మీడియానే ఆయన వైపల్యాను ఎత్తిచూపడం గమనార్హం. జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ఇప్పుడు తాపీగా తప్పులు చేశానని చంద్రబాబు చెపితే ఎవరు నమ్ముతారు అన్న ప్రశ్నసోషల్ మీడియాలో ఉత్పన్నమవుతుంది. మరి ఆయనకు ఉన్న అనుభవం అంతా ఎటుపోయినట్లని సూటిగా ప్రశ్నస్త్రాలను సంధిస్తున్నారు. ఆయన ఇంతకాలం  ఎవరి మాటలు నమ్మి ముందుకు సాగినట్లని నిలదీస్తున్నారు.


వైసిపి అవినీతి సామ్రాజ్యానికి వాటాలు వేసి పంచుతున్నారా..?.‘‘నెల్లూరు రూరల్ వైసిపి ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరాయి. వైసిపి ఎమ్మెల్యేలు వాళ్ల నియోజకవర్గాలలో పోటీబడి దందాలు చేస్తున్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే దీని వెనుక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మధ్యవర్తిగా చేసే పంచాయితీలు మరో ఎత్తు. ఇసుక దందాలు, భూకబ్జాలు,వైసిపి అవినీతి సామ్రాజ్యానికి వాటాలు వేసి జగన్మోహన్ రెడ్డి పంచుతున్నారని చంద్రబాబు నిందారోపణలు చేయడాన్ని సోషల్ మీడియా ఆక్షేపిస్తుంది


ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా..తనకు తానుగా ప్రచార ఆర్భాటం చేసుకోవడంలో అందెవేసిన చేయి బాబొరిది. గొప్ప విజనరీ అని..తనంత ముందు చూపుతో ఆలోచించే వాడే లేడని ప్రకటించుకునే  చంద్రబాబు ఇంకా అలా చేయకపోతే బాగుండేదంటున్నారు నెటిజనులు. మొత్తం మీద చంద్రబాబు తన తప్పులను జాబితాను ప్రజల ముందు పెడుతున్నారు. తాజాగా మోడీతో ఘర్షణ పడకుండా ఉండే బాగుండేది అంటన్నారు. మోడీతో..కేంద్రంతో విభేదించి నష్టపోయామనే విషయాన్నీ ఆయనకంటికి ఆయనే చెప్పుకురావడం వాస్తవమే అయినప్పటికీ వినటానికి కాస్త వింతగా ఉందంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: