భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మోడీ-xi మీటింగు కోసం మహాబలిపురంలో సమావేశమైన సంగతి తెలిసిందే. తమిళనాట విచ్చేసిన జిమ్ పింగ్ కు అక్కడి ఆలయాల ప్రతిష్ఠను మరియు ఆ ప్రాంతంలోని విశేషాలను తమిళనాడు సంప్రదాయమైన దుస్తులు అయిన పంచె కట్టి మరీ వివరించారు మన ప్రధాని మోడీ. తర్వాత కొబ్బరి బొండం తాగి సేదతీరుతూ రెండు దేశాలకు మంచి జరిగేలా కొన్ని అంశాలను మాట్లాడుకున్నారు. అయితే వీటన్నింటి మధ్యలో జిన్ పింగ్ ఒకానొక సందర్భంలో కొంచెం విచిత్రంగా వ్యవహరించారు కానీ అది కూడా అతని మంచికే.

చైనా నుండి చెన్నై కు విమానం ద్వారా చేరుకున్న అధ్యక్షుడు అక్కడి నుండి 57 కిలోమీటర్ల దూరం ఉన్న మహాబలిపురానికి హెలికాప్టర్ ఏర్పాటు చేసినా అందులో వెళ్లకుండా రోడ్డు మార్గం ద్వారానే తన బలమైన శత్రుదుర్భేద్యంగా ఉండే కారు 'హ్యాంగ్ కీ' లో వెళ్లారు. మరో విశేషం ఏమిటంటే అతనిని కారులో పంపించి మోడీ మాత్రం జిన్ పింగ్ ను కార్ లో పంపించి అతను మాత్రం చెన్నై నుండి విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్లో మహాబలిపురం చేరుకున్నాడు. 

పూర్వం ఇలానే 'రచ్చబండ' కార్యక్రమం కోసం వాతావరణం బాగా లేకపోయినా మన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి గారు తమ ప్రాణాలను పణంగా పెట్టి హెలికాప్టర్ లో బయల్దేరారు. అసలే దేశంలో ఎన్నడూలేని విధంగా వర్షాలు పడుతున్న దశలో వేరే దేశ అధ్యక్షుడు ప్రాణాలను రిస్కు చేయడం కూడా మంచిది కాదు. కానీ మన అధికారులు ప్రత్యేక హెలికాప్టర్ను ఏర్పాటు చేసినా చైనా అధ్యక్షుడు మాత్రం ముందు జాగ్రత్తగా తన ప్రత్యేక కారులోనే వెళ్ళాడు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే చైనాలో విఐపిలు ఇతర దేశాలకు వచ్చినా వారి కారునే ఉపయోగిస్తారు. వారు రక్షణ నిమిత్తం హెలికాప్టర్లు వాడరు. కారు మరియు విమానాన్ని మాత్రమే వారు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

ఇలాగే మన రాష్ట్రంలో కూడా ఒక భద్రత నేపథ్యంలో అవగాహన వస్తే బాగుండు. ఏ మాత్రం మొహమాటానికి పోకుండా ముందు తన ప్రాణాలకే ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చిన జిన్ పింగ్ అక్కడ ఉన్న అందరినీ ఆశ్చర్యపరిచాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: