ప్రత్యేక రాష్ట్ర సాధన ద్వారా నిధులు , నియామకాలు సాధ్యమని భావించినవారికి పాలకులు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు . తమ జీత, భత్యాలను ఇబ్బడి, ముబ్బడిగా పెంచుకుని , ఉద్యోగులకు మాత్రం జీత , భత్యాలు  పెంచాలంటే మాత్రం  మీనమేషాలు లెక్కిస్తున్నారు . దేశంలోనే ఉద్యోగ , ఉపాధ్యాయులకు అత్యధిక జీతాలు చెల్లిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని పాలకులు చెబుతున్న మాటలన్నీ శుద్ధ అబద్ధమని తేలింది . తెలంగాణ లో కంటే ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉద్యోగ , ఉపాధ్యాయులకు ఎక్కువ జీత భత్యాలు చెల్లిస్తున్నటు  ఒక అధ్యయనం ద్వారా వెల్లడైంది .


ఈ   జాబితా లో తెలంగాణ రాష్ట్రం ఎనిమిదవ స్థానం లో ఉండగా , ముఖ్యమంత్రుల , ఎమ్మెల్యేల , ఎమ్మెల్సీల జీత , భత్యాల్లో మాత్రం అగ్రస్థానం లో కొనసాగుతోంది . తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరి కంటే అత్యధికంగా  4 .10 లక్షల వేతనం తీసుకుంటూ , మిగతా ముఖ్యమంతులందర్నీ వెనక్కి నెట్టివేశారు  . ప్రధాని నరేంద్ర మోడీ కి నెలకు 1 . 60  లక్షల వేతనం లభిస్తుండగా , కేసీఆర్ కు  మాత్రం అంతకు  మూడింతల మొత్తం వేతనం లభిస్తుండడం విశేషం  .


ఇక మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలకు కూడా అడగకుండానే వేతనాలు పెంచిన కేసీఆర్ , ఫిట్మెంట్ ఇచ్చి ఐఆర్ పెంచండి మహాప్రభో ... అంటూ  ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే, వారిని సెల్ఫ్ డిస్మిస్ పేరిట ఉద్యోగాల్లో నుంచి తొలగించే ప్రయత్నాన్ని చేస్తున్నారనే విమర్శలు సర్వత్రా  విన్పిస్తున్నాయి . రాష్ట్ర విభజన వల్ల ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులకు అధిక వేతనాలు లభిస్తుంటే , తెలంగాణ ఉద్యోగులకు జీత భత్యాల్లో కోత తో పాటు, ఉద్యోగ భద్రత కూడా లేకుండా పోయిందని పలువురు వాపోతున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: