తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సాధన జరిగిన తర్వాత  ప్రతీ ఎన్నికలోనూ టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ పడుతుంది. దాదాపుగా అన్ని ఎన్నికల్లోనూ పైచేయి సాధిస్తూ వస్తుండటంతో మరో పార్టీతో పొత్తుల కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. ఇది ఇలా ఉండగా హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయంలో మాత్రం సీపీఐ మద్దతు కోరింది. హుజూర్‌నగర్ ఉపఎన్నికలో కామ్రేడ్లను కలుపుకుపోవాలన్న టీఆర్ఎస్ ఆలోచన బెడిసికొట్టింది. ఉపఎన్నిక సమయంలోనే ఆర్టీసీ సమ్మె తెర పైకి రావడంతో సీపీఐ మద్దతును  ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ కార్మిక వర్గాల నుంచి వెల్లడించడం జరిగింది.


దీంతో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఉపసంహరించుకోక తప్పలేదు. హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలియచేశారు. ఆదిలాబాద్‌లో ఏడో రోజు కార్మికుల సమ్మెలో పాల్గొన్న చాడ వెంకట్ రెడ్డి.. మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు తెలియచేశారు. ప్రభుత్వంపై చాల తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన.. ఇది రాచరికం కాదని.. ప్రజాస్వామ్యం అన్న సంగతి గుర్తుంచుకోవాలని తెలిపారు. ఆర్టీసీ కార్మికులతో ఇప్పటికైనా చర్చలు జరపాలని.. వారి తరుపున చర్చలకు మీము సిద్ధముగా ఉన్నాము అని తెలిపారు. ఆర్టీసీని అప్పుల పాలు కావడానికి ముఖ్య కారణం ప్రభుత్వమేనని ఆరోపించారు. 


ఎప్పుడు మద్దతు అడగని తెలంగాణ రాష్ట్రము  కానీ ఈ హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయంలో మాత్రం సీపీఐ మద్దతు కోరింది. హుజూర్ నగర్ పారిశ్రామిక ప్రాంతం కావడం.. సీపీఐకి కొంత సాంప్రదాయ ఓటు బ్యాంకు ఉండటంతో ఆ పార్టీని కలుపుకోవడం వాళ్ళ  కలిసొస్తుందని భావించింది. ఈ మేరకు పార్టీ పార్లమెంటరీ నేత కేకే నేత్రుత్వంలోని బృందం సీపీఐతో చర్చలు జరిపి పొత్తు ఖరారు చేసింది. 


కానీ ఇంతలోనే ఆర్టీసీ సమ్మె తెరపైకి రావడం.. అటు ప్రభుత్వం,ఇటు కార్మికులు ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో సీపీఐ పునరా ఆలోచనలో పడింది. కార్మికవర్గాల్లో పట్టున్న సీపీఐ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్‌కు మద్దతునిస్తే.. కార్మికుల్లో వ్యతిరేకత ఏర్పడుతుందని భావన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు సీపీఐ తెలియచేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: