టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో గానీ.. ఎన్నికల హామీల్లో గానీ ఎప్పుడు ఆర్టీసీ విలీనం గురించి మీము చెప్పలేదని మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టంగా తెలియచేశారు.  ఆర్టీసీని ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వంలో విలీనం చేసే ఆలోచనే లేదని మరోసారి స్పష్టం తెలిపారు. నిజానికి చర్చల నుంచి ఏకపక్షంగా వెళ్లిపోయింది కార్మిక నాయకులే అని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు అన్నీ కలిపి 7358 బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు.


బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలకు ఈ సందర్భంగా మంత్రి అజయ్ పలు ప్రశ్నలు వేశారు. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు గతంలో పాలించిన రాష్ట్రాల్లో గానీ..ఇప్పుడు పాలిస్తున్న రాష్ట్రాల్లో గానీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా? అని ప్రశ్నలు వేశారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని గుర్తించి బాధ్యతగా ఉండాలి అని అయినా కోరారు. 


దేశంలో రైల్వేనే ప్రైవేటీకరించిన బీజేపీ.. రాష్ట్రంలో మాత్రం ఆర్టీసీ ప్రభుత్వ విలీనంపై మాట్లాడటం మంచిది  కాదు అని అన్నారు. గతంలో ఆర్టీసీ ఎన్నడూ లాభాల్లో లేదని.. కేసీఆర్ రవాణా మంత్రిగా పనిచేసినప్పుడు మాత్రమే ఆర్టీసీ రూ.14కోట్ల లాభంలోకి వచ్చిందని మరో సారి గుర్తుచేశారు. ఆర్టీసీ లాభాల్లో కొనసాగాలంటే.. 50శాతం ప్రభుత్వ బస్సులు, 30శాతం హైరింగ్, 20శాతం రూట్ పర్మిషన్ బస్సులను నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలియచేసారు. 


అంతే కానీ  ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నట్టు ఎక్కడా కూడా తెలియచేయలేదు అని గుర్తు చేశారు. ఆర్టీసీ ఉండాలని కేసీఆర్ ఇదివరకే కుండబద్దలు కొట్టారని గుర్తు చేయడం కూడా జరిగింది. ఆర్టీసీ కార్మికులు కేవలం 20శాతం ఫిట్‌మెంట్ అడిగితే 44శాతం ఫిట్‌మెంట్ కేసీఆర్ ఇచ్చారు అని చెప్పారు.  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేనాటికి ఆర్టీసీ ఆస్తుల విలువ రూ.4416 కోట్లు అని.. కొంతమంది తప్పుడు లెక్కలతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అయినా  మండిపడ్డారు. లక్ష కోట్ల ఆర్టీసీ ఆస్తులను కాజేయాలని కుట్ర పన్నారు అని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: