ఒకచోట గిరి గీసుకొని కూర్చోవడం వలన పెద్దగా ఉపయోగం ఉండదు.  పైగా కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది.  అందుకే బ్రాడ్ గా ఆలోచించాలని చాలామంది అనుకుంటారు.  కొంతమందికే అది సాధ్యం అవుతుంది.  అందరు గొప్ప గొప్ప విజయాలు సాధించలేకపోవచ్చు.  సాధించకుండా ఓటమిని ఒప్పుకోవడం అంటే దానికంటే అవమానం మరొకటి ఉండదు.  గతంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి తగిన సమయం లేకపోవడం, వంటి కారణాల వలన పవన్ కళ్యాణ్ ఓటమిపాలయ్యారు.  


ఇదిలా ఉంటె, పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి రాబోతున్నారా అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి.  అనారోగ్యం కారణంగా కొన్నిరోజులు కేరళ వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్న పవన్ కళ్యాణ్..టీట్మెంట్ మధ్యలోనే హరిద్వార్ వెళ్లారు.  అక్కడ గంగ ప్రక్షాళన కోసం పోరాటం చేసి అసువులు బాసిన జెడి అగర్వాల్ ప్రధమ వర్ధంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ హరిద్వార్ వెళ్లి ఆయనకు నివాళులు అర్పించారు.  


గంగ ప్రక్షాళన కోసం తనవంతుగా పవన్ కళ్యాణ్ దక్షిణాది నుంచి పోరాటం చేస్తానని అంటున్నారు. పవన్ దక్షిణాది నుంచి పోరాటం చేస్తే.. తప్పకుండా దానికి  మద్దతు లభిస్తుంది. గంగానది ప్రక్షాళన విషయంలో పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకుంటే జాతీయ స్థాయిలో తప్పకుండా పాపులర్ అవుతారు.  రాజకీయాల్లో సైతం రాణించే అవకాశం ఉంటుంది.  ఇప్పటి వరకు కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితమైన పవన్.. గంగ విషయంలో పోరాటం చేస్తే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవచ్చు. 


పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించే ప్రసక్తే లేదని ఇప్పటికే స్పష్టం చేశారు.  అంతేకాదు, తన జీవం ఉన్నంతవరకు రాజకీయాల్లోనే ఉంటానని ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే.  యురేనియం విషయంలో కూడా పవన్ కళ్యాణ్ స్టెప్ తీసుకోడంతో అందరు ముందుకు వచ్చారు.  అలానే మిగతా విషయాల్లో కూడా పవన్ దృష్టిపెడుతున్నారు.  రాజకీయాలతో పాటు సామజిక అంశాలలో కూడా పవన్ దృష్టి పెట్టి పోరాటం చేస్తే.. పవన్ ఈజీగా జాతీయ రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంటుంది.  మరి పవన్ మనసులో ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: