ఆర్టీసీ సమ్మె  కారణంగా  స్కూళ్లు , కాలేజీలకు  ఈనెల 19వరకు  దసరా సెలవులను పొడిగిస్తూ  తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు  జారీ చేసింది.  నిజానికి  సోమవారం నుండి   పాఠశాలలు  తెరుచుకోవాల్సి ఉండగా  గత  కొద్దీ రోజులు గా  ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆప్రభావం ఇప్పుడు విద్యార్థులపై  కూడా  పడింది.  సిటీలో అయితే ఎక్కువగా ఆటోలు , ఇతర  ప్రైవేట్  వాహనాల్లో  విద్యార్థులు  పాఠశాలలకు వెళ్తుంటారు. కానీ  గ్రామీణ ప్రాంతాల్లో  విద్యార్థులు  ఎక్కువ ఆర్టీసీ  బస్సు లపైనే  అదరపడుతారు కాబట్టి వారికీ ఇబ్బంది కలగకూడదని  రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో  ఈనెల 21 న  పాఠశాలలు , కాలేజీలు పున ప్రారంభం కానున్నాయి.


ఇదిలా ఉంటే  ఆర్టీసీ కార్మికులు   సమ్మెను  ఉధృతం చేసేలా  ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 19న ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది.  ఈనెల 13న  వంటావార్పు , 14న  బహిరంగ సభలు 15న రాస్తోరోకోలు , 16న ఐకాసకు మద్దతుగా  విద్యార్థులు ర్యాలీలు 17న ధూమ్ ధామ్ కార్యక్రమాలు 18న బైక్ ర్యాలీలు నిర్వహించాలని ఐకాస  కార్యాచరణను  రూపొందించింది. ఇక  ఆర్టీసీ  కార్మికులు  చేస్తున్న సమ్మెకు  కోదండ రామ్ కూడా మద్దతు పలికారు. 


మరో వైపు  ఆర్టీసీ సమ్మె నేపథ్యం లో సర్కార్   ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పై ద్రుష్టి పెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్...   రవాణా శాఖ మంత్రి పువ్వడా అజయ్ కుమార్ , ఆర్టీసీ అధికారులతో  కొద్దీ సేపటి క్రితం  భేటీ అయ్యారు.  అద్దె బస్సులకు నోటిఫికేషన్ ఇవ్వాలని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా  ఆర్టీసీ బస్సులను  పూర్తి స్థాయిలో  నడపడాలని వీలైనంత ఎక్కువ గా తాత్కాలిక కండక్టర్లను , డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: