తెలంగాణలో టీఎస్ఆర్టీసీ సమ్మె ఎనిమిదిరోజులకు చేరుకుంది. టీఎస్ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం   చేయాలన్న ప్రధాన డిమాండ్ తో ఉద్యోగులు సమ్మెకి దిగారు.  అయితే కార్మికులవి గొంతెమ్మ కోరికలని..వారి డిమాండ్స్ కి అస్సలు తలొగ్గం అని ప్రభుత్వం భీష్మించుకు కూర్చింది. ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులను తిరిగి విధుల్లో చేర్చుకునేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ప్రైవేట్ వాహనాలతో మరికొంత మంది సిబ్బందిని తీసుకొని ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని కేసీఆర్ అంటున్నారు. అంతే కాదు కార్మికులు సమ్మే చేయడం వల్ల ప్రజలకు ఇక్కట్లు పడుతున్నారని..ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా దేనికైనా సిద్దమే అని అంటున్నారు సీఎం కేసీఆర్. అయితే కేసీఆర్ వ్యాఖ్యలు విన్న తర్వాత  మనస్థాపానికి గురైన డ్రైవర్ ఆత్మహత్య యత్నానికి పాల్పపడ్డాడు. 

ఖమ్మం జిల్లా రాపర్తినగర్ కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ భీంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పెట్రోల్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకున్నాడు. ఈ నేపథ్యంలో సుమారు 90 శాతం కాలిపోయాడు.. అతని పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు.  కాగా, ఆర్టీసీ కార్మికుల పట్ల కేసీఆర్ కఠినంగా వ్యవహరిస్తున్నారని.. ఇప్పటికే ముగ్గురు ఆర్టీసీ కార్మికులను కోల్పోయినట్లు జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. సమ్మె నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల వల్ల ఆర్టీసీ కార్మికులు మానసికంగా కృంగిపోతున్నారని ఆర్టీసీ జేఏసీ ఆరోపిస్తోంది. కార్మికులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పొడద్దని అందరూ ధైర్యంగా ఉండాలని ఎలాంటి ఆందోళన చెందొద్దని సూచించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: