దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా.. తన ఎస్బిఐ కస్టమర్లకు వివిధ రకాల సేవలను అందిస్తూ టాప్ లో ఉంది. అయితే ఈ బ్యాంకింగ్ సర్వీసులో నెట్ బ్యాంకింగ్ సర్వీసు కూడా ఒక భాగం. స్టేట్ బ్యాంక్ అందించే ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీస్ ని ఆన్లైన్ ఎస్బిఐ అని పిలుస్తారు. అయితే ఆన్లైన్ ఎస్బిఐ సేవలు పొందాలంటే బ్యాంకులో ఖచ్చితంగా అకౌంట్ ఉండాలి. 


ఆ బ్యాంకు బ్రాంచ్ కు వెళ్లి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీస్ కోసం రిజిస్టర్ చేయించుకోవాలి. అప్పుడు బ్యాంక్ ప్రిప్రింటెడ్ కిట్ అందచేస్తుంది. ఆ ప్రిపింటెడ్ లో ఉండే యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఉంటాయి. వాటి సాయంతో https://www.onlinesbi.com కు వెళ్లి లాగిన్ అవ్వాలి. అందులో మొదటిసారి లాగిన్ అవుతే నెట్ బ్యాంకింగ్ అసిస్టెంట్ అది ఎలా వాడాలి అనేది గైడ్ చేస్తుంది. 


అయితే నెట్ బ్యాంకింగ్ యూజర్లు అప్పుడప్పుడు పాస్‌వర్డ్ మార్చుకుంటూ ఉండాలి. అప్పుడే హ్యాకర్లు, మోసగాళ్ల బారిన పడకుండా ఉంటాం. అయితే నెట్ బ్యాంకింగ్ కి పెట్టిన పాస్‌వర్డ్ మర్చిపోతే ఇలా మార్చుకోండి.. 


onlinesbi.com వెబ్‌సైట్‌కు వెళ్లి యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.


మై అకౌంట్ అండ్ ప్రొఫైల్ ఆప్షన్‌పై క్లిక్ చెయ్యాలి.


ప్రొఫైల్ ఎంచుకున్న తర్వాత మై ప్రొఫైల్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.


తర్వాత ఫోర్గెట్ ప్రొఫైల్ పాస్‌వర్డ్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.


తర్వాత హింట్ కొశ్చన్‌ను ఎంచుకొని, దానికి సమాధానం ఇవ్వాలి.


కొత్త పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. మళ్లీ అదే పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి.


తర్వాత ఓకే చేయాలి. కొత్త పాస్‌వర్డ్ క్రియేట్ అవుతుంది. అంతే.. చూసారుగా ఇలా చేసి మీ నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ ని కొత్తది క్రియేట్ చేసుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: