రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె ఎనిమిదొవ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మో ఆపమని, మాకు న్యాయం చెయ్యాలని లేకపోతే ఇంకా ఉదృతం చేస్తామని వారు అంటున్నారు. అయితే ఈ సమ్మెపై ఈరోజు మీడియాతో మాట్లాడిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదని పువ్వాడ స్పష్టం చేశాడు.     

   

కాగా సమ్మో చేసిన కార్మికులను ఉద్యోగాలలో తీసేసి కొత్తవారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. దీంతో చాలామంది ఆర్టీసీ కార్మికులు భయోందోలనుకు గురవుతున్నారు. ఈరోజు సాయింత్రం ఆర్టీసీ ఖమ్మం డిపోలో పని చేస్తున్న శ్రీనివాసరెడ్డి తన ఇంటివద్ద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడని కుటుంబసభ్యులు తెలిపారు.


శ్రీనివాస్ రెడ్డి శరీరంలో తొంబై శాతం మేర కాలిపోయినట్టు సమాచారం. దీంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే సమ్మెపై మనస్థాపం చెంది ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటన చూస్తుంటే అర్థం అవుతుంది ఆర్టీసీ సమ్మె వల్ల ఆత్మహత్యలు మొదలయ్యాయి అని. ఏదిఏమైనా ప్రభుత్వం స్పందించిన తీరు సరిగ్గా లేదు. 


ఒక వైపు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య యత్నం చేసుకుంటుంటే అటు ప్రభుత్వం మాత్రం మీరు చచ్చిన మాకు అనవసరం అన్నట్టు ప్రవర్తిస్తుంది అని ఆర్టీసీ కార్మికులు లబోదిబోమని కొట్టుకుంటున్నారు. కాగా తాజాగా అందిన సమాచారం ప్రకారం శ్రీనివాస్ రెడ్డి విషమం కావడంతో ఆర్టీసీ కార్మికులు బస్సులపై రాళ్ళూ విసిరి అద్దాలు పగలకొడుతున్నారని సమాచారం. మరి శ్రీనివాస్ రెడ్డి ఆరోగ్యం గురించి వివరాలు తెలియాల్సి ఉంది.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: