ఖమ్మం జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ పరిస్థితి విషమించడంతో ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు బస్సుపై దాడి చేస్తూ అద్దాలు ధ్వంసం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ప్రభుత్వం 50 వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు చేసిన ప్రకటన వలనే శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 
 
ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తూ ఒక బస్సుకు అడ్డుపడి అద్దాలు ధ్వంసం చేసినట్లు సమాచారం అందుతోంది. శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఆ తరువాత శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వ ఆస్పత్రి నుండి అతని కుటుంబ సభ్యులకు తెలియకుండా వేరే ఆస్పత్రికి పోలీసులు తరలించటంతో ఆర్టీసీ కార్మికుల ఆందోళన తీవ్రమైంది.ఆర్టీసీ కార్మికులు కొందరు ప్రభుత్వ ఆస్పత్రి ముందు కూడా ధర్నా చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. 
 
ఆర్టీసీ కార్మికులు తెలంగాణ రాష్ట్రమంతటా ముఖ్యమంత్రికి, మంత్రికి వ్యతిరేఖంగా నినాదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కొన్ని చోట్ల వాహనాల్ని దారి మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది.  ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని ఎక్కడికి తరలించారనే విషయం గురించి తెలుసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
కార్మికులతో పాటు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు మరియు నాయకులు కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికుల సమ్మె వలన తెలంగాణ రాష్ట్రంలోని కోటి మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ సమ్మెతో ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు ఏ మాత్రం సరిపోవటం లేదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: