ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సృష్టించిన సరికొత్త వ్యవస్థ గ్రామ/వార్డు వాలంటీర్లు. ప్రజలకు నేరుగా సేవలు అందించడమే లక్ష్యంగా జగన్ ఈ వ్యవస్థని తీసుకొచ్చారు. దీని వల్ల ప్రజలకు ప్రభుత్వ సేవలు అందడంతో పాటు...ఎన్నో ఏళ్లుగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టారు. అధికారంలోకి వచ్చిన ఒక నెలలోనే సీఎం జగన్, గ్రామ/వార్డు వాలంటీర్ల పేరిట లక్షల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ వెంటనే ఇంటర్వ్యూలు నిర్వహించి దాదాపు రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు.


ఆగష్టు 15 స్వాతంత్య్ర‌ దినోత్సవం పురస్కరించుకుని గ్రామాల్లో వాలంటీర్ల సేవలు మొదలయ్యాయి. ప్రతి 50 ఇళ్లకు సంబంధించిన సమస్యలని వాలంటీర్లే పరిష్కరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం వాలంటీర్ల ద్వారా ప్రజలకు నేరుగా అందుతుంది. ఇటీవల జగన్ ప్రకటిస్తున్న ప్రతి పథకంలో వాలంటీర్లు అర్హులని గుర్తించి ఆ వివరాలని వారి పైన ఉన్న అధికారికి అందజేస్తున్నారు. అలాగే అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వ పథకం అందేలా చేస్తున్నారు.


పెన్షన్లు, రేషన్ లాంటివి ప్రజలకు నేరుగా అందిస్తున్నారు. అయితే వాలంటీర్ల కష్టం ఎక్కువగా ఉంటుందని గుర్తించిన సీఎం జగన్...త్వరలోనే వారి జీతాలని పెంచే ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం రూ. 5 వేలుగా ఉన్న వారి జీతాలని రూ.8వేలు చేస్తారని తెలుస్తోంది. అయితే వాలంటీర్లని మంచిగానే చూసుకుంటున్న, జగన్ వారు ఏమైనా తప్పు చేస్తే నిర్దాక్షిణ్యంగా ఉద్యోగం నుంచి తప్పిస్తున్నారు.


ఇటీవల కొందరు వాలంటీర్లు పెన్షన్ల పంపిణీ సందర్భంగా లబ్దిదారుల నుంచి దసరా మాముళ్ల పేరిట డబ్బులు వసూలు చేశారు. ఈ విషయంపై సీరియస్ అయిన జగన్ వారిని విధులు నుంచి తప్పించారు. అయితే రాష్ట్రం మొత్తం వాలంటీర్లు చిత్తశుద్ధితో పనిచేస్తూ...జగన్ ప్రభుత్వానికి అండగా  నిలుస్తున్నారు. మొత్తానికి ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య వారథిలా ఉంటూ...జగన్ సైనికుల్లాగా పని చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: