రెండు రోజుల భారత పర్యటన కోసం చైనా అధ్యక్షుడు శుక్రవారం చెన్నైకు చేరుకున్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి కాసేపు హోటల్‌లో విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం మహాబలిపురంకు వెళ్లారు. అయితే చాపర్‌లో వెళ్లాల్సిన చైనా అధ్యక్షుడు మహాబలిపురంకు రోడ్డుమార్గం ద్వారా వెళ్లారు. చెన్నై నుంచి మహాబలిపురం 57 కిలోమీటర్లు ఉంది.

 

ఈ మొత్తం దూరాన్ని జిన్‌పింగ్ చాపర్ ద్వారా కాకుండా రోడ్డు మార్గం ద్వారా తన హాంగ్‌కీలో వెళ్లారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ చెన్నై విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మహాబలిపురంకు చేరుకున్నారు.

 

హాంగ్‌కీలో మహాబలిపురంకు జిన్‌పింగ్

హాంగ్‌కీ అనేది చైనాకు చెందిన చాలా విలాసవంతమైన కారు. అధికారిక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు చెందిన నేతలు ఈ లగ్జరీ కారును వినియోగిస్తారు. మాఓ జెడాంగ్ నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీకి చెందిన దేశాధ్యక్షులు అందరూ ఇదే కారును వినియోగిస్తున్నారు.

 

చైనీస్ భాషలో హాంగ్‌కీ అంటే అర్థం ఎర్ర జెండా. ఇక మోడీతో నిన్న చర్చలు ముగిశాక అంతా తిరిగి చెన్నై చేరుకున్నారు. ఇక శనివారం మళ్లీ చైనా అధ్యక్షుడితో పాటు అతని బృందం మహాబలిపురంకు చేరుకుంటుంది. ఇక్కడే మోడీతో చర్చలు జరుపుతారు అధ్యక్షుడు జిన్‌పింగ్. ఇక మధ్యాహ్నం నేపాల్‌కు జిన్‌పింగ్ బయలుదేరి వెళతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: