ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి.. ఇద్ద‌రు వేర్వేరు పార్టీల నేత‌లు. ఒక‌రు సీఎంగా ఉన్నారు. ఒక‌రు ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి. ఈ ఇద్ద‌రు ఒక‌ప్పుడు ఒకేపార్టీలో ఉన్న‌వారే. కాకుంటే రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో వేర్వేరుగా మిగిలిపోయారు. అయితే ఇప్పుడు ఈ భిన్న‌దృవాలు ఒకేచోట భేటీ కాబోతున్నారు. సీఎం జ‌గ‌న్‌, మెగాస్టార్ చిరంజీవి భేటి నేప‌థ్యంలో ఏపీ, తెలంగాణ‌లో ఎక్క‌డ చూసినా ఒక‌టే రాజ‌కీయ చ‌ర్చ‌. అస‌లు ఇద్ద‌రు ఎందుకు క‌లుస్తున్నారు. వీరి క‌ల‌యిక‌లో చ‌ర్చ‌కు వ‌చ్చే ఆంశాలు ఏమిటి.. ఇద్ద‌రు క‌లిస్తే రాబోవు రాజ‌కీయ ప‌రిస్థితులు ఎలా ఉండ‌బోతున్నాయి.


ఈ భేటి కేవ‌లం సాధార‌ణ‌మేనా.. లేక రాజకీయ ప్రాధాన్య‌త ఉందా.. వీటికి తోడు కేవ‌లం సీఎం జ‌గ‌న్‌ను సైరా మూవీ కోసం ఆహ్వ‌నించేందుకేనా.. అనేది ఇక్క‌డ చ‌ర్చ‌నీయాంశంగా మారిన నేప‌థ్యంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మ‌రో  పెద్ద చ‌ర్చ‌కు తెర‌లేచింది. అదేంటంటే.. సీఎం జ‌గ‌న్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయితే త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రియాక్ష‌న్ ఏంటో అనేది. ఏపీ సీఎం జ‌గ‌న్‌పై జ‌న‌సేన అధినేత పవ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేస్తూ ముందుకు పోతున్నారు.


ఏపీ సీఎం జ‌గ‌న్ చేప‌డుతున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను పొగ‌డటం అటుంచి విమ‌ర్శించ‌డానికే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. దీంతో సీఎం జ‌గ‌న్ ప‌వ‌న్‌పై ఒకింత అస‌హానంతోనే ఉన్నారు. అయితే ఇప్పుడు సీఎం జ‌గ‌న్‌తో భేటీ కోసం మెగాస్టార్ చిరంజీవి అపాయింట్ మెంట్ కోరారు. దీనికి జ‌గ‌న్ వెంట‌నే అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ముందుగా ఈనెల 11న భేటీ జ‌రుగాల్సి ఉండే. కానీ అనివార్య కార‌ణాల‌తో ఈ భేటీ ఈనెల 14కు వాయిదా ప‌డింది. ఈ భేటీ కేవ‌లం టీ, కాఫీల‌తో ముగియ‌కుండా ఏకంగా సీఎం జ‌గ‌న్  త‌న ఇంట్లోనే లంచ్ కు ఆహ్వానించారు. అంటే మెగాస్టార్‌తో జ‌గ‌న్ స‌న్నిహిత సంబంధాలు నెరుపాల‌నే ఆలోచ‌న‌తోనే ఉన్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది.


అంటే సీఎం జ‌గ‌న్‌తో మెగాస్టార్ భేటీ అయితే త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రియాక్ష‌న్ ఏంటో, ఆయ‌న అంత‌రంగం ఏమిటో అంతు చిక్క‌డం లేదు. ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీగా ప్ర‌జ‌ల్లో ఉంటున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అన్న మ‌ద్ద‌తు దొరుకుతుంద‌ని గ‌త కొంత కాలంగా ఆశ ప‌డుతున్నాడు.అంతే కాదు.. మెగాస్టార్ చిరంజీవి చేప‌డుతున్న ప్ర‌తి కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ భాగ‌స్వామ్యం అవుతున్నాడు. ఇప్పుడు అన్న సీఎం జ‌గ‌న్‌తో క‌లిస్తే త‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ వైఖ‌రి ఏంటో స్ప‌ష్టం చేస్తాడా.. లేదా..? లేక త‌న అన్న‌తో త‌ను వ్య‌వ‌హరించే తీరులో  మార్పు తెచ్చుకుంటారా వేచి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: