టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ పైన మమకారం చూపించారు. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన చోట ఎందుకు ప్రచారం చేయలేదో ఇప్పుడు వివరించారు. నాడు వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రచారం నిజమే అనే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు కనిపిస్తున్నాయనే విశ్లేషణలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ గెలిచి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని వ్యాఖ్యానించారు. 

 

ఇక, బీజేపీతోనూ తాను వ్యవహరించిన తీరు సరి కాదనే అభిప్రాయం వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో విభేదించాం. దాని వల్ల నష్టపోయాం.. రాష్ట్రానికి లాభం జరగలేదు.. పార్టీకి నష్టం జరిగింది.. అది పెట్టుకోకుండా ఉంటే ఇంకో విధంగా ఉండేదంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రయోజనం పొందిన ప్రజలు సైతం తనకు సహకరించలేదని వాపోయారు.చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యల ద్వారా మరో సారి రాజకీయంగా ఏపీలో ఆసక్తి కర చర్చ సాగుతోంది..

 

అందుకే గాజువాక ప్రచారానికి రాలేదు..

టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా గాజువాక నేతలతో సమావేశమయ్యారు. ఆ సమయంలో తాజా ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చింది. అక్కడ చంద్రబాబు పర్యటించకపోవడంపై 30 వేల మంది టీడీపీ క్రియాశీల కార్యకర్తలలో సందేహం ఏర్పడిందని నియోకవర్గానికి చెందిన ఒక నేత చంద్రబాబుకు వివరించారు. 

 

అదే సమయంలో వైసీపీ నేతలు సైతం పదే పదే చంద్రబాబు..వపన్ మధ్య తెర వెనుక పొత్తు నడుస్తోందని..అందులో భాగంగానే చంద్రబాబు జనసేన అదినేత పవన్ పోటీ చేస్తున్న గాజువాక..భీమవరం లో ప్రచారం చేయటం లేదని పదే పదే ప్రచారం చేసారు.

 

దీనిని టీడీపీ నేతలు చంద్రబాబు ముందు ప్రస్తావించారు. కనీసం ఆరోపణలను టీడీపీ సరిగ్గా తిప్పికొట్టలేక పోయిందని..దీంతో టీడీపీ కార్యకర్తల్లో అనుమానం పెరిగిందని స్థానిక నేతలు చెప్పుకొచ్చారు. దీనికి పార్టీ అధినేత చంద్రబాబు సమాధానం ఇచ్చారు. తాను ఎందుక గాజువాకలో ప్రచారానికి రాలేదో చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: