నగరంలో ఈఎస్ఐ  స్కామ్ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ స్కామ్ లో  విచారణ వేగవంతం చేస్తున్నారు ఎసిబి అధికారులు. ఇప్పటికే ఈ ఎస్ ఐ  నిందితులు డైరెక్టర్ దేవికారాణి తో పాటు... మరో 13 మంది నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. అయితే ఇప్పటికే కొన్ని వివరాలు సేకరించాం  అని చెబుతున్న అధికారులు... మరింత క్షుణ్ణంగా విచారణ జరిపేందుకు ఈఎస్ఐ నిందితులను విచారించేందుకు కోర్టు అనుమతి కోరిన విషయం తెలిసిందే . అయితే ఈఎస్ఐ స్కామ్ లో   మొదటిగా డైరెక్టర్ దేవికారాణి  అరెస్టయ్యారు. షేక్ పేట లోనే ఆమె ఇంట్లో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. 

 

 

 

 

 

 అయితే తాజాగా ఈ ఎస్ ఐ స్కాం లో మరో వికెట్ పడింది. మెడికల్ క్యాంపు నిర్వహించకున్న మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు  తప్పుడు మెడికల్ క్యాంపు ల బిల్లులు  పెట్టి  కోట్లాది రూపాయలను డ్రా చేసుకున్న సీనియర్ అసిస్టెంట్ సురేంద్రనాథ్ ను ఎసిబి అధికారులు అరెస్టు చేసి రిమాండ్ కు  తరలించారు. ఈఎస్ఐ స్కామ్  లో వెలుగులోకి వచ్చిన సురేంద్రనాథ్  ఆడియోలు బయటకు రావడంతో ఆడియో టేపులు ఆధారంగా.... విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు  తప్పుడు బిల్లు పెట్టాలని కొందరిని సురేంద్రనాథ్ బెదిరించినట్లు గుర్తించారు. అంతేకాకుండా వాస్తవానికి ఆర్సీ పురం డిస్పెన్సరీ లో విధులు  నిర్వహించాల్సిన సురేంద్రనాథ్ ని ... డైరెక్టర్ దేవికారాని  కార్యాలయానికి తెప్పించుకుని తన కోసం ఇక్కడ పని చేయించారట. 

 

 

 

 

 

 ఈఎస్ఐ స్కామ్ లో  విచారణ వేగవంతం చేసిన ఏసీబీ అధికారులు మరిన్ని ఆధారాలు సేకరించెందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా ఈఎస్ఐ స్కామ్  నిందితుల నుండి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఒకేసారి ఇరవై మూడు చోట్ల సోదాలు జరిపిన ఎసిబి అధికారులు... దాదాపు పది వేల  కోట్ల స్కామ్  జరిగినట్లు అంచనా వేశారు. ఈ పది వేల కోట్ల మందులకు గాను  డైరెక్టర్ దేవికారాణి  లక్ష రూపాయలు క్లెయిమ్  చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా అర్హతలేని ఏజెన్సీల నుండి కూడా మందులకు కొన్నట్లు స్పష్టమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: